Modi : ప్రజాగలం సభలో నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Modi : ప్రజాగలం సభలో నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు..!

Modi : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ జనసేన మరియు బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మూడు పార్టీలకు చెందిన అధినేతలు చిలకలూరిపేటలోని బొప్పూడి లో ప్రజాగలం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇక ఈ భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఇక ఈ భారీ బహిరంగ సభకు మూడు పార్టీలకు చెందిన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. […]

 Authored By tech | The Telugu News | Updated on :18 March 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Modi : ప్రజాగలం సభలో నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు..!

Modi : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ జనసేన మరియు బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మూడు పార్టీలకు చెందిన అధినేతలు చిలకలూరిపేటలోని బొప్పూడి లో ప్రజాగలం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇక ఈ భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఇక ఈ భారీ బహిరంగ సభకు మూడు పార్టీలకు చెందిన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ఈ భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ముందుగా తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ ప్రారంభించారు. అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్ మరియు మాజీ ప్రధాని పీవీ నరసింహారావును నరేంద్ర మోడీ స్మరించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని కీర్తించారు. ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడు మరియు రాముడు పాత్రలలో ఒదిగిపోయి నటించేవారని అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట రోజు అదే గుర్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

రైతుల కోసం పేదల కోసం ఎన్టీఆర్ గారు చాలా పోరాడారని అందుకే ఆయన శతజయంతి ఉత్సవాలలో నాణెం విడుదల చేశామని తెలిపారు. అనంతరం మోడీ తన ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనపై చరమగీతం పాడాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రితో పాటు ఏపీ మంత్రులు కూడా అవినీతి అక్రమాలతో పోటీపడుతున్నారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్న వైయస్ జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు వేరు కాదని ఈ రెండు పార్టీలని నడుపుతుంది ఒకే కుటుంబానికి చెందిన వారిని అది ప్రజలు గమనించాల్సిందిగా తెలియజేశారు. అదేవిధంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిచే విధంగా కృషి చేయాలని అప్పుడే వికాసిత భారత్ తో పాటు వికాసిత ఆంధ్ర రాష్ట్రాన్ని చూడడం సాధ్యమవుతుందని తెలిపారు.

కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేసే ముందు కచ్చితంగా రెండు సంకల్పాలను గుర్తుపెట్టుకోవాలని ఒకటి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడో సారీ స్థానం సంపాదించడం ,రెండవది రాష్ట్రంలో అవినీతి వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడాలి. ఈ రెండు సంకల్పాలను గుర్తు పెట్టుకొని ఓటు వేయాల్సిందిగా నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇక జగన్ పాలనలో ఏపీ లో ఐదేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని దేశంతో పాటు ఏపీ కూడా అభివృద్ధి కావాలని కోరుకునేవారు ముందుకు వచ్చి ఓటు వేయాల్సిందిగా తెలియజేశారు. ఇక రాబోయే 5 సంవత్సరాలు చాలా కీలకమైనవిగా చెప్పుకొచ్చారు. ఎన్డీఏ తోనే రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి పేదల సంక్షేమం సాధ్యమవుతుందని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ పన్నాగాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు ఎన్డీఏకు ఓటు వేయాల్సిందిగా ప్రధాని పిలుపునిచ్చారు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది