Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గంలో ముద్రగడ పోటీ?
Pawan Kalyan : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఎందుకు ఇంతలా రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ పై ఆయన తీవ్రస్థాయిలో రెచ్చిపోయి మరీ బహిరంగ లేఖ రాశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెద్ద లేఖే రాశారు. ఆ లేఖలో పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పు పట్టారు ముద్రగడ. అయితే.. పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా ఘాటుగానే అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. గుండు గీయిస్తా అంటున్నావు. చెప్పుతో కొడతా అంటున్నావు. తొక్క తీస్తా.. నార తీస్తా అంటున్నావు. ఇప్పటి వరకు ఎంతమందిని కింద కూర్చోబెట్టావు. ఎంతమందికి గుండు గీయించావు.. అంటూ పవన్ కళ్యాణ్ ను ముద్రగడ నిలదీశారు.
ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే ముద్రగడ లేఖ సంచలనం సృష్టిస్తోంది. నేను ఏ పార్టీకి అమ్ముడుపోలేదు. ఎవ్వరికీ అమ్ముడుపోలేదు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాపులను ఆదుకుంటా అని హామీ ఇచ్చారు. సాయం చేస్తా అన్నారు. చివరకు ఏమైంది. నేను కాపు నేతలకు సీఎం పదవి అడిగాను. అది నా నిబద్ధత అంటూ ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు కదా. అసలు.. ద్వారంపూడి గురించి పవన్ కు ఏం తెలుసు. ద్వారంపూడి కుటుంబం మొత్తం కాపు ఉద్యమానికి సాయం చేసింది. ఆయన ఉద్యమ సమయంలో ఎంతో సాయం చేశారు.
Pawan Kalyan : ద్వారంపూడి గురించి పవన్ కు ఏం తెలుసు
ఆయన ఎన్నో వాహనాలను పంపారు. ఎమ్మెల్యేను తిట్టడం ఆపి.. ముందు పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు, ఏపీ ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ పై దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు. పవన్ కళ్యాణ్ కు అసలు నిలకడ ఉందా? బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తారట. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు. జనసేనకు మద్దతు ఇవ్వండి అంటున్నారు. ముఖ్యమంత్రి అవుతారట. వాళ్లతో కలిసి పోటీ చేసి పవన్ ముఖ్యమంత్రి ఎలా అవుతారో? పొత్తులతో పోటీ చేసి గెలిచి సీఎం అవుతావా పవన్.. నా లేఖ వల్ల పవన్ అభిమానులకు కోపం రావచ్చు. నన్ను ఏమైనా చేయొచ్చు.. అంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.