vijayasai reddy : టీడీపీ తస్మాత్ జాగ్రత్త… వైకాపా మొహమాటం లేకుండా మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా కుమ్మేస్తుందట
vijayasai reddy: గత ఏడాది మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మరియు మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున ఏకగ్రీవాలు అయ్యాయి. వైకాపా వందల సంఖ్యలో పంచాయితీలను బలవంతంగా ఏకగ్రీవం చేసేసుకుంది. చాలా చోట్ల కనీసం ప్రత్యర్థి వారు పోటీ పడకుండా అడ్డుకోవడంతో పాటు దాడులకు కూడా తెగ బడ్డట్లుగా ప్రచారం జరిగింది. ఏకంగా ఎన్నికల కమీషన్ ఏకగ్రీవాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది అంటే వైకాపా ఏ రేంజ్ లో ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో జరిగిన ఏకగ్రీవాలు ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటాయి అన్నట్లుగా అధికార పార్టీ నాయకులు వ్యవహరించారు. పరిషత్ ఎన్నికలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి కనుక ఎక్కడ ఆగాయో అక్కడ నుండి మొదలు పెట్టాలని ప్రభుత్వం ఎస్‌ఈసీని డిమాండ్ చేసింది. వారి కోరిక మేరకు అలాగే జరిగింది.
vijayasai reddy : మున్సిపల్ ఎన్నికల్లో కూడా..
పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కుమ్మేసిన వైకాపా త్వరలో జరుగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలకు ప్రయత్నించబోతున్నట్లుగా నిర్మొహమాటంగా ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రకటించాడు. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా వైకాపా విజయం సాధిస్తుందనే నమ్మకంను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తూనే మరో వైపు ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉండబోతున్న నేపథ్యంలో వైకాపా నాయకులు ముందస్తుగానే ప్రత్యర్థి పార్టీ వారిని దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
వైకాపా అధికార దుర్వినియోగం..
విజయ సాయి రెడ్డి మాటలపై తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నాయి. ఒక బాధ్యతగల పదవిలో ఉండటంతో పాటు ఎలాగూ అధికారం చేతిలో ఉంది కదా అని ప్రతిపక్షాలను భయపెట్టి ఏకగ్రీవాలను చేసుకోవాలనుకోవడం ఏమాత్రం సబబు కాదని హెచ్చరించారు. ఓటర్లు ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా మీకు సరైన బుద్ది చెప్తారు. అన్ని రోజులు మీవి కావు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. పెద్ద ఎత్తున ఏకగ్రీవాలకు పాల్పడితే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తామని అధికార దుర్వినియోగం గురించి ఈసీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.