Nara Lokesh : నారా లోకేష్ కు పోటీగా మురుగుడు లావణ్య.. ఏరి కోరి మరీ పట్టుకొచ్చిన వైయస్ జగన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Lokesh : నారా లోకేష్ కు పోటీగా మురుగుడు లావణ్య.. ఏరి కోరి మరీ పట్టుకొచ్చిన వైయస్ జగన్..!

 Authored By tech | The Telugu News | Updated on :3 March 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Nara Lokesh : నారా లోకేష్ కు పోటీగా మురుగుడు లావణ్య.. ఏరి కోరి మరీ పట్టుకొచ్చిన వైయస్ జగన్..!

Nara Lokesh : 175 కి 175 స్థానాలలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీకి కొన్ని నియోజకవర్గాలలో కాస్త టెన్షన్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై వైసీపీకి టెన్షన్ నెలకొంది. ఎందుకంటే వీరిద్దరూ గెలిచి అసెంబ్లీ లోకి వస్తే వైయస్ జగన్ టార్గెట్ అవుతారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి ఉన్నా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వస్తే వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తారు. గడిచిన ఐదు సంవత్సరాలలోని అంశాలను బయటికి తీస్తారు. ఈ క్రమంలోనే వీరిద్దరి విషయం లో వైయస్ జగన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారా లేక పిఠాపురం నుంచి పోటీ చేస్తారా అనేది క్లారిటీ రాలేదు. మరోవైపు నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారనేది కన్ఫామ్ అయిపోయింది.

ఇక ఈ మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించడానికి వైఎస్ జగన్ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నారా లోకేష్ పై ఆర్కే పోటీ చేసి గెలిచారు. అయితే గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే కి ప్రజల్లో విముఖత ఉంది. ఈ క్రమంలోనే మంగళగిరిలో గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చారు. గతంలో టీడీపీలో ఉన్న గంజి చిరంజీవి లోకేష్ రావడంతో టీడీపీ నుంచి తప్పుకొని వైసీపీలోకి చేరారు. అయితే ఇప్పుడు మంగళగిరి కి మురుగుడు లావణ్యను తీసుకొచ్చారు వైఎస్ జగన్. అయితే ఈమె మురుగుడు హనుమంతరావు కోడలు అని తెలుస్తుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంగళగిరి నుంచి రెండుసార్లు పోటీ చేసి గెలిచిన మురుగుడు హనుమంతరావు కోడలే ఈ లావణ్య అని తెలుస్తుంది. అయితే బీసీ క్యాండిడేట్ గంజి చిరంజీవిని పక్కన పెట్టి మురుగుడు లావణ్యను ఎందుకు తీసుకొచ్చారు అనే చర్చ మొదలైంది. అయితే మంగళగిరిలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే మురుగుడు లావణ్య కు వైఎస్ జగన్ టికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఇటీవల ఓ వీడియోలో గంజి చిరంజీవి ప్రజలు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. అందుకే మురుగుడు లావణ్య కి టికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకైతే ఆమెను ఇన్చార్జిగానే ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంటుంది. ఇక మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్న క్రమంలో వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎలాగైనా మంగళగిరిలో గెలవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏరికోరి మురుగుడు లావణ్యను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్కే, గంజి చిరంజీవి లాంటి వాళ్లను పక్కనపెట్టి మురుగుడు లావణ్య కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఇక్కడ మంగళగిరి నుంచి ఆమె గెలుస్తారా లేక నారా లోకేష్ గెలుస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓఓడిపోయారు. సారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. మరి ఈసారి గెలుస్తారా లేదా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది