
Nagababu : అన్న కోసం పదవిని రిజర్వ్ చేసిన పవన్ కళ్యాణ్.. ఇది కదా బాండింగ్ అంటే..!
Nagababu : జనసేన పార్టీ కోసం నాగబాబు చాలా కష్టపడ్డారు. పలు మీటింగ్స్‌లో క్రియాశీలకంగా వ్యవహరించారు. తొలుత అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని భావించినా..పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించారు. ఆ తరువాత నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం సాగింది. కానీ, పవన్ ఖండించారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల పైన కసరత్తులో భాగంగా నాగబాబుకు ఇవ్వాల్సిన పదవి పైన చంద్రబాబు -పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ గెలుపు వెనుక ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేసారు.
అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల్లో వారి మద్దతు కూడగట్టంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మెగా ఫ్యాన్స్ ను ఏకం చేసి వారి మద్దతు సంపాదించారు. కాపు సామాజిక వర్గాలతోనూ సమావేశాలు నిర్వహించారు. మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు మాత్రమే జనసేన విజయం కోసం పూర్తి స్థాయిలో పని చేసారు. దీంతో, నాగబాబుకు కొత్త ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కనుంది. ప్రస్తుతం నాగబాబు మాత్రం పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటూ పవన్ కి సహకారంగా ఉంటూ వస్తున్నారు. అలాంటి ఆయనకు తమ్ముడు పవన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారుట. అదే ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అని సమాచారం.
Nagababu : అన్న కోసం పదవిని రిజర్వ్ చేసిన పవన్ కళ్యాణ్.. ఇది కదా బాండింగ్ అంటే..!
నాగబాబుకు ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి ఇవ్వటం పైనా చర్చ జరిగినా..ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సినీ రంగం..ఇటు ప్రభుత్వంలో సత్సంబంధాలు ఉన్న వ్యక్తిగా నాగబాబుకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏపీలో సినీ పరిశ్రమను విస్తరించేలా బాధ్యతలు తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే నాగబాబుకు ఈ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నాగబాబుకు దక్కే పదవి పైన అధికారికంగా నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది. తాజాగా నామినేటెడ్ పదవుల పైన చంద్రబాబు – పవన్ సుదీర్గ కసరత్తు చేసారు. మూడు పార్టీలకు పదవుల పంపకాల పైన ఒక నిర్ణయానికి వచ్చారు.
Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…
LPG Gas Cylinder : దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో,…
Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్ తెలుగు’…
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
This website uses cookies.