Nagababu : నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే బాలయ్య ను తక్కువ చేసినట్లేనా..?
ప్రధానాంశాలు:
Nagababu : నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే బాలయ్య ను తక్కువ చేసినట్లేనా..?
Nagababu : జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత తన తొలి రాజకీయ ప్రసంగాన్ని జనసేన ఆవిర్భావ సభలో ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పిఠాపురంలో టీడీపీ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇదే సమయంలో నాగబాబు “మీ ఖర్మ” అనే వ్యాఖ్యలు చేసిన తీరు, ఆయన పవన్ కల్యాణ్ నేతృత్వంపై ప్రత్యేకమైన విశ్లేషణ అందించడంపై టీడీపీ వర్గాల్లో నూతన చర్చను తెరపైకి తెచ్చింది. ఇక ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు, ఇప్పుడు మంత్రివర్గంలో చేరతారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

Nagababu : నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే బాలయ్య ను తక్కువ చేసినట్లేనా..?
Nagababu బాలకృష్ణ కు కాకుండా నాగబాబు కు మంత్రి పదవి ఇస్తారా..?
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఉగాది నాటికి నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. జనసేనకు ప్రత్యేక గుర్తింపుగా నాగబాబును కేబినెట్‌లోకి తీసుకోవాలని టీడీపీ ఆలోచిస్తోందని అంటున్నారు. అయితే ఇప్పుడే మంత్రి పదవి ఇవ్వాలా? లేకపోతే కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి అయిన తరువాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో అవకాశం కల్పించాలా? అనే అంశంపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వకుండా, నాగబాబును ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సరైనది? అనే ప్రశ్న కూడా బాలయ్య అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
టీడీపీ – జనసేన కూటమిలో కొంత గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం కూడా సాగుతోంది. ఇలాంటి సమయంలో నాగబాబును మంత్రిగా చేస్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం జూన్ 12 నాటికి ఏడాది పూర్తి చేసుకుంటుండటంతో, అప్పటివరకు మంత్రివర్గ మార్పులు ఆగుతాయా? లేక ఉగాదినాడే నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.