Chandrababu : చంద్రబాబు అరెస్టు తర్వాత మొదటి ప్రెస్ మీట్ లో జగన్ కి వార్నింగ్ ఇచ్చిన లోకేష్..!!
Chandrababu : తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అరెస్టు చేసిన అనంతరం ఫస్ట్ టైం లోకేష్ సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని.. తన తండ్రిని అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అంటే దేశ రాజకీయాల్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఓ బ్రాండ్. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ఫార్చ్యూన్ 500 సీఈఓ లు కూడా ఒప్పుకుంటారు.
నిరంతరమైన ప్రజల గురించి దేశం గురించి ఇంకా అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటారు. సైకో జగన్ కుట్రలు చేసి చంద్రబాబుపై అవినీతి మరకలు వెయ్యటానికి అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తనపై ఉన్న బురదను జగన్ ఈ రాష్ట్రంలో మిగతా నేతలు అందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై ఎక్కడ అవినీతి మరకలు పడలేదు. కానీ జగన్ ఎంత సైకోనో ప్రజలకు అర్థమైంది.
మనీలాండరింగ్ కూడా జరగలేదని ఈడీ స్పష్టం చేసింది. మరి అలాంటప్పుడు చంద్రబాబుకి అక్రమంగా డబ్బులు ఏ రూపంలో వచ్చాయో ప్రభుత్వం నిరూపించగలదా అని లోకేష్ సవాల్ విసిరారు. తన తండ్రి చంద్రబాబు ఎక్కడ తప్పు చేయలేదని అన్నారు. చంద్రబాబు జోలికొచ్చి జగన్ అతిపెద్ద తప్పు చేశాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జైలుకెళ్తే మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంకా చాలామంది ప్రముఖులు ఖండించినట్లు పేర్కొన్నారు.