Nara Lokesh : ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ కాదు.. కష్టాల్లో ఉంటే రాడా.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు?

Advertisement

Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు గురించే చర్చ. చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ. చంద్రబాబు అరెస్ట్ ను నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ.. పోలీసులు మాత్రం నిరసన చేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తెలంగాణలోనూ చంద్రబాబుకు మద్దతు భారీగా లభిస్తోంది. ఐటీ ఉద్యోగులు కూడా రోడ్డు మీదికి వచ్చి చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారంటూ నిలదీస్తున్నారు.

Advertisement

ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు అరెస్ట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఎందుకంటే.. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సైలెంట్ గా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. అంతే కాదు.. సైమా అవార్డ్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో సహా దుబాయ్ వెళ్లారు. దీంతో జూనియర్ పై నారా లోకేష్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై టీడీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. అంతే కాదు.. నారా లోకేష్ కూడా జూనియర్ పై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. నా అన్న పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు ఇచ్చారు కానీ.. కొందరు సొంత వాళ్లు ఉండి కూడా పట్టించుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొందరు మా కుటుంబంలో ఉన్నారు.

Advertisement
nara lokesh Comments on Jr ntr
nara lokesh Comments on Jr ntr

Nara Lokesh : స్పందించే బాధ్యత నీకు లేదా ఎన్టీఆర్

నాన్న జైలులో ఉంటే ఇలాంటి సమయంలో మమ్మల్ని పట్టించుకోకుండా వాళ్లు ఫ్యామిలీస్ తో ట్రిప్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంటే ఎలా అంటూ నారా లోకేష్ ఇన్ డైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మరి.. నారా లోకేష్ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement