Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఇరుపాక్షాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ తరఫున నారా లోకేష్ యువగళం సభలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. యువతతో కూర్చుని ముఖాముఖి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువగళం సభలో జూనియర్ ఎన్టీఆర్ గురించి అభిమానులు అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేనప్పటికీ రాజకీయంగా మాత్రం ఆయన ఎప్పుడూ వార్తల్లో వస్తూనే ఉంటారు. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ఆయన పేరును ప్రస్తావిస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు వల్లభనేని వంశీ మరియు కొడాలి నాని రోజుకోసారైనా సరే జూనియర్ ఎన్టీఆర్ ను ప్రస్తావిస్తూనే ఉంటారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి నిజమైన వారసుడంటూ వారు ఎన్నో సందర్భాలలో కామెంట్స్ కూడా చేశారు. అంతేకాక జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాల్లోకి రావాలని ఉన్నప్పటికీ నారా చంద్రబాబు మరియు నారా లోకేష్ అడ్డుకుంటున్నారని పలు సందర్భాలలో వారు తెలియజేశారు. అయితే వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ 2009లోనే ఏపీలో టీడీపీ పార్టీ తరఫున ప్రచారాలు చేశారు. ఇక అదే సమయంలో ఓ రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. ఆ ప్రమాదం తర్వాత కొన్నాళ్లపాటు ఆసుపత్రిలో కాలం గడిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాలకు మరింత దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఆయన్ని రాజకీయాలలోకి రావాలని అభిమానులు మరియు టీడీపీ కార్యకర్తలు చాలామంది కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయినప్పుడు రాజకీయపరంగా చిత్ర విచిత్రమైన వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి రాజకీయంగా పెద్దగా వార్తలు రాలేదు.కానీ ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు తరచుగా వినిపిస్తుందని చెప్పాలి.ఈ నేపథ్యంలోనే యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ యువకులతో నిర్వహించిన మూఖ మూఖిలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావన రావడం జరిగింది. అయితే ఈ యువగళం కార్యక్రమంలో ఓ యువకుడు జూనియర్ ఎన్టీఆర్ ను పాలిటిక్స్ లోకి ఆహ్వానిస్తారా అని నారా లోకేష్ ను అడగడం జరిగింది. ఇక ఈ ప్రశ్నకు నారా లోకేష్ చాలా క్లియర్ కట్ గా సమాధానం చెప్పాడు. ఒకే ఒక్క మాటతో తాను చెప్పాల్సింది మొత్తం చెప్పేసాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ను నూటికి నూరు శాతం రాజకీయాల్లోకి ఆహ్వానిస్తానని తెలియజేశారు.
అంతేకాదు ఎవరైతే ఏపీలో మార్పు కోరుకుంటున్నారో, ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్లాలని ఆశిస్తున్నారో అలాంటి వారంతా కచ్చితంగా రాజకీయాల్లోకి రావచ్చని వారిని నేను కచ్చితంగా ఆహ్వానిస్తానని నారా లోకేష్ తెలియజేశారు. అయితే నారా లోకేష్ చేపిన్న ఈ ఒక్క మాటతో మొన్నటివరకు లోకేష్ కు మరియు ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు ఉన్నాయని విమర్శిస్తున్న వారందరికీీ గట్టి సమాధానం ఇచ్చినట్లుగా అయింది. ఇక ఈ ఒక్క మాటతో వారిద్దరి మధ్య విభేదాలు మనస్పర్దాలు లాంటివి లేవని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.