Nara Lokesh : జూనియర్ ఎన్టీఆర్ గురించి మొదటిసారి మాట్లాడిన నారా లోకేష్… బావ రాకకోసం ఎదురుచూస్తున్నా…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Nara Lokesh : జూనియర్ ఎన్టీఆర్ గురించి మొదటిసారి మాట్లాడిన నారా లోకేష్… బావ రాకకోసం ఎదురుచూస్తున్నా…!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఇరుపాక్షాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ తరఫున నారా లోకేష్ యువగళం సభలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. యువతతో కూర్చుని ముఖాముఖి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువగళం సభలో జూనియర్ ఎన్టీఆర్ గురించి అభిమానులు అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 March 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Nara Lokesh : జూనియర్ ఎన్టీఆర్ గురించి మొదటిసారి మాట్లాడిన నారా లోకేష్...బావ రాకకోసం ఎదురుచూస్తున్నా...!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఇరుపాక్షాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ తరఫున నారా లోకేష్ యువగళం సభలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. యువతతో కూర్చుని ముఖాముఖి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువగళం సభలో జూనియర్ ఎన్టీఆర్ గురించి అభిమానులు అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే..  జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేనప్పటికీ రాజకీయంగా మాత్రం ఆయన ఎప్పుడూ వార్తల్లో వస్తూనే ఉంటారు. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ఆయన పేరును ప్రస్తావిస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు వల్లభనేని వంశీ మరియు కొడాలి నాని రోజుకోసారైనా సరే జూనియర్ ఎన్టీఆర్ ను ప్రస్తావిస్తూనే ఉంటారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి నిజమైన వారసుడంటూ వారు ఎన్నో సందర్భాలలో కామెంట్స్ కూడా చేశారు. అంతేకాక జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాల్లోకి రావాలని ఉన్నప్పటికీ నారా చంద్రబాబు మరియు నారా లోకేష్ అడ్డుకుంటున్నారని పలు సందర్భాలలో వారు తెలియజేశారు. అయితే వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ 2009లోనే ఏపీలో టీడీపీ పార్టీ తరఫున ప్రచారాలు చేశారు. ఇక అదే సమయంలో ఓ రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. ఆ ప్రమాదం తర్వాత కొన్నాళ్లపాటు ఆసుపత్రిలో కాలం గడిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాలకు మరింత దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఆయన్ని రాజకీయాలలోకి రావాలని అభిమానులు మరియు టీడీపీ కార్యకర్తలు చాలామంది కోరుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయినప్పుడు రాజకీయపరంగా చిత్ర విచిత్రమైన వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి రాజకీయంగా పెద్దగా వార్తలు రాలేదు.కానీ ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు తరచుగా వినిపిస్తుందని చెప్పాలి.ఈ నేపథ్యంలోనే యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ యువకులతో నిర్వహించిన మూఖ మూఖిలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావన రావడం జరిగింది. అయితే ఈ యువగళం కార్యక్రమంలో ఓ యువకుడు జూనియర్ ఎన్టీఆర్ ను పాలిటిక్స్ లోకి ఆహ్వానిస్తారా అని నారా లోకేష్ ను అడగడం జరిగింది. ఇక ఈ ప్రశ్నకు నారా లోకేష్ చాలా క్లియర్ కట్ గా సమాధానం చెప్పాడు. ఒకే ఒక్క మాటతో తాను చెప్పాల్సింది మొత్తం చెప్పేసాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ను నూటికి నూరు శాతం రాజకీయాల్లోకి ఆహ్వానిస్తానని తెలియజేశారు.

అంతేకాదు ఎవరైతే ఏపీలో మార్పు కోరుకుంటున్నారో, ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్లాలని ఆశిస్తున్నారో అలాంటి వారంతా కచ్చితంగా రాజకీయాల్లోకి రావచ్చని వారిని నేను కచ్చితంగా ఆహ్వానిస్తానని నారా లోకేష్ తెలియజేశారు. అయితే నారా లోకేష్ చేపిన్న ఈ ఒక్క మాటతో మొన్నటివరకు లోకేష్ కు మరియు ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు ఉన్నాయని విమర్శిస్తున్న వారందరికీీ గట్టి సమాధానం ఇచ్చినట్లుగా అయింది. ఇక ఈ ఒక్క మాటతో వారిద్దరి మధ్య విభేదాలు మనస్పర్దాలు లాంటివి లేవని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది