Nara Lokesh : నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభమైంది. సెప్టెంబర్ 9న ఆగిన పాదయాత్రను ఇవాళ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం లో తిరిగి ప్రారంభించారు. ఆ తర్వాత తాటిపాకలో నిర్వహించిన సభలో జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు. 2019లో జనసేన పార్టీ నుంచి రేపాక వరప్రసాద్ ను ఆశీర్వదించి దీవించి గెలిపించారు. కానీ ఆయన నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఏకంగా సైకో జగన్ పార్టీలో చేరాడు. చేరేముందు రాజోలుని అద్భుతంగా మారుస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏకంగా రాజోలును అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చావు. ఇప్పుడు ఈ పిల్ల సైకో ఐదేకరాలలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు.
ఆ ఇంటికి రోడ్డు వేసే ఖర్చు 20 లక్షల రూపాయలు. ఆ డబ్బులు కూడా ఎంపీ లాయడ్స్ నుంచి తీసుకొని ఇంటికి రోడ్డు వేయించుకుంటున్నాడు. చింతలమూరి సముద్రతీరంలో పేదలకు చెందిన 15 ఎకరాలు భూమిని ఈ వ్యక్తి కబ్జా చేసుకున్నాడు. ఈ ఎమ్మెల్యే కుమారుడు వెంకట్రావు కూడా ఇసుకను భారీ ఎత్తున దోచేస్తున్నాడు. ఇక అంగన్వాడి, విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా 50 వేల నుంచి 5 లక్షల రూపాయలకు ఈ ఎమ్మెల్యే అమ్మేసుకున్నాడు. ఇంకా ఏకంగా సముద్ర తీరం నిరుపేద మత్స్యకారుల నుంచి పెద్ద ఎత్తున భూములు లాక్కొని కె.వి.ఆర్ రాయల్స్ పేరిట ఆ భూములను కూడా ఈ ఎమ్మెల్యే కొట్టేస్తున్నాడు.
కేశనపల్లి ప్రాంతంలో ఎస్సీ సొసైటీల భూములను కూడా ఈ ఎమ్మెల్యే రేపాక వరప్రసాద్ కొట్టేసే పరిస్థితి. ఇంకా తాడేపల్లి కొంపలో ఒక ప్యాలెస్ కడుతున్నాడు. వాడి పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. అతడి ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూ దందా జరుగుతుంది. మూడు నెలలు ఓపిక పడితే టీడీపీ కార్యకర్తలను వేధించిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాను అని లోకేష్ అన్నారు. రాజోలు లో ఉన్నా, రష్యా కు పారిపోయిన వెనక్కు తీసుకువచ్చి జైలుకు పంపడం ఖాయం అని అన్నారు. మరో మూడు నెలల్లో టిడిపి అధికారంలోకి రాబోతుందని, కచ్చితంగా ఈ వేధింపులకు బదులు తీర్చుకుంటానని, రాజారెడ్డి రాజ్యాంగం పనైపోయిందని, అంబేద్కర్ రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది అని ఆయన అన్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.