Home » Andhra Pradesh » Nara Lokesh Comments On Ys Jagan 2
andhra pradesh

Nara Lokesh : సొంత చెల్లెమ్మని తిడుతున్న వైయస్ జగన్ సొంత అన్నేనా.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు ..!

Authored By
aruna
The Telugu News | Published on: February 14, 2024, 4:00 pm
Advertisement

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టెక్కలి శంఖారావం సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శల దాడికి దిగారు. 2019 ఎన్నికల ముందు అన్న విడిచిన బాణం అని వైఎస్ షర్మిల రాష్ట్రమంతా తిరిగారు. అలాంటి చెల్లిని, తల్లిని వైయస్ జగన్ ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత మాకు భద్రత లేదని బయటికి వచ్చి చెబుతున్నారు. సొంత ఇంటిలోనే మహిళలకు వైయస్ జగన్ భద్రత ఇవ్వనప్పుడు ఆంధ్ర రాష్ట్ర మహిళలకు వైయస్ జగన్ ఎలా భద్రత కల్పిస్తాడని ప్రశ్నించారు. జగన్ ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. పదే పదే సభలలో బటన్ నొక్కిన అని చెబుతుంటాడు. పైన బ్లూ బటన్ నొక్కి కింద ఎర్ర బటన్ నొక్కుతాడు. పది రూపాయల అకౌంట్లో పడితే 100 రూపాయలు అతడికి పోతున్నాయి.
కరెంటు చార్జీలను 9సార్లు పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు.

Advertisement

అలాగే బస్ చార్జీలను కూడా మూడుసార్లు పెంచాడు. ఇంటి పన్ను చెత్త పన్ను అంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. వైయస్ జగన్ పేదవాడు అని చెప్పుకుంటున్నాడని లక్ష రూపాయలు విలువ చేసి చెప్పులు వేసుకునే వ్యక్తి పేదవాడు అవుతాడు అని ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్ కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అని చురకలు అంటించారు. ఐదేళ్ల అధికారంలో ఉన్న సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఒక ఫ్యాక్టరీని కూడా చేర్పించలేకపోయారు. ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అయిన పూర్తి చేయలేదు. వైయస్ జగన్ పోలీసుల పొట్ట కొట్టాడని లోకేష్ విమర్శించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తుల డేటా రెడ్ బుక్ లో ఉందని హెచ్చరించారు. రోజుకో మోసం, పూటకో అబద్ధం వైయస్ జగన్ తీరని ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని లోకేష్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ తీయని మాటలు చెప్పారు. అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోయారని విమర్శించారు. ప్రతి ఏటా డీఎస్సీ అని చెప్పి ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు.

టీడీపీ, జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని లోకేష్ వెల్లడించారు. మా నమ్మకం నువ్వే జగన్ అని బోర్డులు పెడుతున్నారని జగన్ ను తల్లి చెల్లి నమ్మడం లేదని అలాంటప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు అని ప్రశ్నించారు. ప్రాణహాని ఉందని వైఎస్ షర్మిల , వైఎస్ సునీత చెప్పే పరిస్థితి వచ్చిందని లోకేష్ పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ కల్పించని వైయస్ జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారని విమర్శించారు. వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు షర్మిలను బెదిరిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. జగన్ చూస్తే కోడి కత్తి, చంద్రబాబును చూస్తే కియా కారు గుర్తువస్తాయని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ ప్రిజనరీ చంద్రబాబునాయుడు విజనరీ అని పేర్కొన్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి