Nara Lokesh : గత ప్రభుత్వం చేతకాని తనం వల్లనే 12 లక్షల డ్రాపౌట్స్ … నారా లోకేష్ కామెంట్స్
ప్రధానాంశాలు:
Nara Lokesh : గత ప్రభుత్వం చేతకాని తనం వల్లనే 12 లక్షల డ్రాపౌట్స్ ... నారా లోకేష్ కామెంట్స్
Nara Lokesh : ఏపీ అసెంబ్లీ andhra pradesh సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో తమపై వస్తున్న విమర్శలపై నారా లోకేష్ Nara Lokesh హట్ కామెంట్ చేశారు. గత ప్రభుత్వం చేతకాని తనం వల్లనే 12 లక్షల డ్రాపౌట్స్ అని నారా లోకేష్ అన్నారు. జీవో నెం.117 తీసుకొచ్చి పేదలకు ప్రభుత్వ విద్యను దూరం చేశారు.

Nara Lokesh : గత ప్రభుత్వం చేతకాని తనం వల్లనే 12 లక్షల డ్రాపౌట్స్ … నారా లోకేష్ కామెంట్స్
Nara Lokesh లోకష్ ఫైర్..
117 జీవోకి ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నాం.టీచర్ల బదిలీలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కు స్టార్ రేటింగ్ ఇస్తున్నాం అని లోకేష్ స్పష్టం చేశారు. ఇక 19మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17 మందిని బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి Chandra Sekhar Reddy చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వాలని కోరారు. ఆధారాలు ఇస్తే ఇప్పుడే విచారణకు ఆదేశిస్తానన్నారు. అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి లోకేశ్ Lokesh సవాల్ విసిరారు. బెదిరించడం, భయపెట్టడం, బయటకు పంపడం మీ అలవాటు అని దుయ్యబట్టారు లోకేశ్