Nara lokesh : సమయం లేదు మిత్రమా! శరణమా.. న్యాయ సమరమా? జగన్ కు లోకేష్ వార్నింగ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara lokesh : సమయం లేదు మిత్రమా! శరణమా.. న్యాయ సమరమా? జగన్ కు లోకేష్ వార్నింగ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 June 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Nara lokesh : సమయం లేదు మిత్రమా! శరణమా.. న్యాయ సమరమా? జగన్ కు లోకేష్ వార్నింగ్..!

Nara lokesh : ఆంధ్రప్రదేశ్‌లో “తల్లికి వందనం” పథకం చుట్టూ రాజకీయ రగడ నడుస్తుంది. రాష్ట్రంలో 89 లక్షల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, బీపీఎల్ కుటుంబాలందరికీ పథకం వర్తించాలన్న నిబంధన ప్రకారం చాలామందికి నిధులు అందలేదని వైఎస్సార్సీపీ ఆరోపించింది. గత ఏడాది పథకం నిధులు బకాయిలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం కూడా పలువురిని జాబితాల నుంచి తొలగిస్తూ, వైఎస్సార్సీపీ అనుకూలులను వంచిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆడపిల్లల విషయంలో న్యాయం జరుగడం లేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara lokesh సమయం లేదు మిత్రమా శరణమా న్యాయ సమరమా జగన్ కు లోకేష్ వార్నింగ్

Nara lokesh : సమయం లేదు మిత్రమా! శరణమా.. న్యాయ సమరమా? జగన్ కు లోకేష్ వార్నింగ్..!

Nara lokesh : పారిపోయి ప్యాలెస్ లో దాక్కున్న జగన్ .. బయటకు రా..! – లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

ఈ ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇచ్చే రూ.13వేలలో తన ఖాతాలో రూ.2,000 జమ అయినట్లు వైఎస్సార్సీపీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. “మీ వద్ద ఆధారాలు ఉంటే చూపించండి” అంటూ ఆయన సవాల్ విసిరారు. ఒకవేళ ఆధారాలు చూపించలేకపోతే వైఎస్సార్సీపీ నాయకులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే తాను న్యాయపోరాటం చేస్తానని లోకేష్ స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలపై ఇక మౌనంగా ఉండే ప్రసక్తే లేదని అన్నారు.

ఈ వివాదంలో సోషల్ మీడియా కూడా వేడెక్కింది. “తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వచ్చాయని చెప్పిన మీ ఆరోపణకు ఏ ఆధారమూ లేదు, అందుకే మీకు ఫేక్ జగన్!” పేరు పెడుతున్న అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. “బురద చల్లడం, విమర్శలు చేసి పారిపోయి ప్యాలెస్ లో దాక్కోవడం జగన్ గారికి అలవాటు” అంటూ మరో ట్వీట్ చేశారు. “సమయం లేదు మిత్రమా – శరణమా? న్యాయ సమరమా? తేల్చుకోండి” అంటూ చివర్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై ఇక లీగల్ యాక్షన్ తప్పదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది