Home » Andhra Pradesh » Nara Lokesh Has Equal Status With Pawan Kalyan
andhra pradesh

Nara Lokesh : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స‌మానంగా లోకేశ్‌.. త్వ‌ర‌లో డిప్యూటీ సీఎం ప‌ద‌వి ?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: October 9, 2024, 5:18 pm
Advertisement

Nara Lokesh : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏర్ప‌డ్డ కూటమి ప్రభుత్వంలో త్వరలోనే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తుంది. జ‌న‌సేన అధినేత‌, న‌టుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో కొన‌సాగుతున్నారు. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కూట‌మి ప్ర‌భుత్వంలో ఒక్కరికే డిప్యూటీ సీఎం అవకాశం ఇచ్చారు అది కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కే. అయితే తాజాగా సీఎం చంద్రబాబు పైన పార్టీ ముఖ్యులతో పాటుగా నందమూరి కుటుంబం నుంచి కొత్త డిమాండ్ విన‌వ‌స్తుంది. పవన్‌తో స‌మానంగా లోకేశ్‌కు కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాల‌ని ఒత్తిడి పెరుగుతుంది. తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడులో డిప్యూటీ సీఎంలకు తగిన గుర్తింపు, ఆద‌ర‌ణ‌ ఉంది. ఏపీ ప్రభుత్వంలోనూ పవన్ కల్యాణ్ కు ఇప్పటి వరకు ప్రాధాన్యత కొనసాగుతూ వ‌స్తుంది. ప్రతీ నిర్ణయంలోనూ వారు కీలకంగా ఉంటున్నారు. అవసరమైన ప్రతీ సందర్భంలో పవన్‌కు చంద్ర‌బాబు తగిన ప్రాధాన్యత ఇస్తూ వ‌స్తున్నారు.

Advertisement

ఇప్పుడు నందమూరి -నారా కుటుంబంతో పాటుగా చంద్రబాబు సన్నిహిత నేతల నుంచి ఒక కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. తమిళనాడులో స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఇటు పార్టీలోనూ, అటు ప్ర‌భుత్వంలోనూ ప్రోత్సహిస్తూ వ‌స్తున్న తీరుగా లోకేశ్‌కు ప్రాధాన్యం క‌ల్పించాల‌ని కోరుతున్నారు. లోకేశ్‌కు కూడా ప‌వ‌న్‌తో స‌మానంగా ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని వారు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్న‌ట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం కొన‌సాగుతుంది. ఇప్పటికే ప్ర‌భుత్వంలో లోకేశ్‌ నిర్ణయాలే దాదాపుగా అమలు అవుతున్నాయనే ప్రచారం ఉంది. చంద్రబాబు సైతం లోకేశ్‌ సూచనలకు ప్రాధాన్యత ఇస్తున్నారని..పవన్ పాలనా వ్యవహారాల్లో అంత‌గా జోక్యం చేసుకోవటం లేదనే చర్చ ఉంది. మంత్రివర్గ సమావేశంలో సీఎం కు అటు, ఇటు పవన్ – లోకేశ్‌ ఆశీనులవుతున్న విషయం అంతా గ‌మ‌నిస్తున్న‌దే. దీని ద్వారా పదవి లేకపోయినా పవన్ -లోకేష్ ఇద్దరూ సమానమనే సంకేతాలు చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఇచ్చారు. ఈ సమయంలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.

Nara Lokesh : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స‌మానంగా లోకేశ్‌.. త్వ‌ర‌లో డిప్యూటీ సీఎం ప‌ద‌వి ?

Advertisement

ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. మిత్రపక్షాలుగా బీజేపీ, జనసేన ఉన్నాయి. రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా మెజార్టీ పరంగా టీడీపీకి వ‌చ్చే ఇబ్బంది లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో లోకేశ్‌కు పార్టీ, ప్రభుత్వంలో మరింత పట్టు పెరిగేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించ‌నున్నారు. కొంత కాలం తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఉప ముఖ్యమంత్రిగా లోకేశ్‌కు ప్రమోషన్ ఇచ్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తుంది. పవన్ తో బంధం కొనసాగిస్తూనే లోకేశ్‌కు ప్రాధాన్యత తగ్గకుండా ఉప ముఖ్యమంత్రి ప‌ద‌వి ఇవ్వడం ఖాయమనే ప్రచారం కొన‌సాగుతుంది…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి