
Nara Lokesh : ఇది కదా లోకేష్ అంటే.. అందరి మనస్సులు ఇలా గెలుచుకున్నాడు...!
Nara Lokesh : ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక నాయకులు అందరు ప్రశంసలు అందుకుంటున్నారు. రాజకీయాల్లో ప్రజల మనసులు గెలుచుకోవాలంటే మాత్రం ఇక సొంత టాలెంట్ ఉండాల్సిందే అని అంటూ ఉంటారు ఎంతోమంది నిపుణులు. ఈ క్రమంలోనే కొంతమంది ఇలా భారీ బ్యాగ్రౌండ్ తో వచ్చిన చివరికి.. తండ్రులకు తగ్గ వారసులుగా నిరూపించుకోలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పాలి. గతంలో రాజకీయ ఉద్దండుడిగా పేరు సంపాదించుకున్న చంద్రబాబు వారసుడిగా అటు ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయింది. ఇక పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లో చదవడం కారణంగా.. తెలుగులో ప్రసంగాలు ఇవ్వడం నారా లోకేష్ కి మొదట్లో కష్టమైంది. అంతేకాదు సబ్జెక్టు పై పెద్దగా నాలెడ్జ్ కూడా లేకపోవడంతో ఎప్పుడు తడబాటుకు గురవుతూ ఉండేవారు. కొన్ని కొన్ని సార్లు ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెబుతూ ఉండేవారు.
లోకేష్ మాటలు చూసి పప్పు పప్పు అంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు అవమానించడం మొదలుపెట్టారు. లోకేష్ ఏ ప్రసంగంలో మాట్లాడిన అతని మాటలలో తప్పులను వెతుకుతూ మరి ఇక విమర్శనాస్త్రాలు గుప్పించారు. అంతెందుకు సోషల్ మీడియాలో కూడా ఎన్నో రోజుల పాటు పప్పు అంటూ వెతికితే లోకేష్ పేరు రావడం కూడా జరిగింది.ఇలా పప్పు పప్పు అని ప్రత్యర్థి పార్టీలు ఎంతల అవమానించినా.. అటు లోకేష్ మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండానే ముందుకు సాగారు. ఇక సబ్జెక్టు పై మరింత అవగాహన పెంచుకొని.. ఇక ఇప్పుడు పదునైన ప్రసంగాలు ఇస్తున్నారు. ఒకప్పుడు పప్పు అని విమర్శించిన నోళ్లే ఇక ఇప్పుడు మారిన లోకేష్ ని చూసి ఫీదా అవుతున్నారు. పప్పు అన్నోడే పదునైన కత్తిలా మారాడు అని అనుకుంటున్నారు.
Nara Lokesh : ఇది కదా లోకేష్ అంటే.. అందరి మనస్సులు ఇలా గెలుచుకున్నాడు…!
అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో ఏ వినియోగదారుడు లోకేష్‌ని చాలా దుర్భాషలాడారు. అయితే తాజాగా తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, సహాయం కావాలని రిక్వస్ట్ చేశాడు. ఈ క్రమంలో స్పందించిన లోకేష్..”మేము అతనిని జాగ్రత్తగా చూసుకుంటాము.. నా టీమ్ అక్కడకు చేరుకుంటుంది అమ్మా!” అని చెప్పుకొచ్చారు. అంతేకాదు కొన్ని గంటల్లోనే లోకేష్ టీమ్ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులను సంప్రదించి అవసరమైన సహాయాన్ని అందజేస్తుందని చెప్పుకొస్తున్నారు. దీంతో లోకేష్ పైన ప్రశంసల వర్షం కురుస్తుంది. మీరు నిజంగా గ్రేట్ సర్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.