Nara Lokesh Vs Ys Jagan : విపక్షాల మధ్య మాటల తూటాలు.. లోకేష్ రాజీనామానా.. వైఎస్ జగన్ సారీనా..?
ప్రధానాంశాలు:
విపక్షాల మధ్య మాటల తూటాలు.. లోకేష్ రాజీనామానా.. వైఎస్ జగన్ సారీనా..?
Nara Lokesh Vs Ys Jagan : ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావొస్తుంది. ఇక అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కడపలో నిర్వహించిన మహానాడులో మంత్రి నారా లోకేష్ వైఎస్ జగన్ Ys Jagan YSRCP కు ఓ సవాల్ చేశారు. అదే సవాల్ ను ఆయన ఇవాళ మళ్లీ రిపీట్ చేసారు. ఈ సవాల్ లో తాను నెగ్గితే జగన్ ఏం చేయాలో, జగన్ నెగ్గితే తానేం చేస్తానో కూడా లోకేష్ స్పష్టంగా చెప్పేశారు.

Nara Lokesh Vs Ys Jagan : విపక్షాల మధ్య మాటల తూటాలు.. లోకేష్ రాజీనామానా.. వైఎస్ జగన్ సారీనా..?
Nara Lokesh Vs Ys Jagan : క్లారిటీగా చెప్పారు..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాజాగా విశాఖలో ఉర్సా అనే సంస్థకు 99 పైసలకే ఎకరం చొప్పన భూకేటాయింపులు చేసిందని విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ గారికి ఓపెన్ ఛాలెంజ్ అంటూ మొదలుపెట్టిన నారా లోకేష్.. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు అన్నారు.
ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డి గారికి కొత్తేమీ కాదన్నారు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు,నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ – 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామన్నారు.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామన్నారు.