Nara lokesh : దారిన పోయే ప్రతి వాడికి సీట్లు ఇస్తే టీడీపీ పరిస్థితి ఏంటి..? జనసేన పై నారా లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్..!!
ప్రధానాంశాలు:
Nara lokesh : దారిన పోయే ప్రతి వాడికి సీట్లు ఇస్తే టీడీపీ పరిస్థితి ఏంటి..? జనసేన పై నారా లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్..!!
ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే ఇరుపాక్ష పార్టీలు పోటీకి సన్నద్ధమవుతున్నాయి. ఇక అధికార పార్టీ అయినా వైయస్సార్ సీపీ పార్టీపై గెలిచేందుకు టీడీపీ, జనసేనతో కూటమిగా ఏర్పడింది.
Nara lokesh : ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే ఇరుపాక్ష పార్టీలు పోటీకి సన్నద్ధమవుతున్నాయి. ఇక అధికార పార్టీ అయినా వైయస్సార్ సీపీ పార్టీపై గెలిచేందుకు టీడీపీ, జనసేనతో కూటమిగా ఏర్పడింది. టీడీపీ, జనసేన పొత్తు వలన వైసీపి పార్టీ ఓడిపోతుందని నమ్ముతున్నారు. అయితే టీడీపీ, జనసేన పొత్తు వలన ఇరు వర్గాల పార్టీల్లో అంతర్గత విభేదాలు ఉన్నాయని టాక్. సీట్ల విషయంలో కూడా టీడీపీకి, జనసేనకి మధ్య అంతర్గత విభేదాలు జరుగుతున్నాయని పబ్లిక్ టాక్ష అయితే ఈ వార్తలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి జనసేనకి అద్భుతమైన సమన్వయం ఉందని, టీడీపీ జనసేన ప్రజల కోసం కలిసి పనిచేస్తున్నాయని, ‘ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ‘ లో టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్నాయని, మా మధ్య ఎటువంటి గొడవలు లేవు అని, టీడీపీ, జనసేన కలిసి తిరుగుతున్నాయని ప్రజల కోసం కలిసి పోరాడుతాయని అన్నారు. టీడీపీ, జనసేన మధ్య ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు, విద్యుత్ కార్మికులు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఇవన్నీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన రోడ్డుమీదికి వచ్చాయి. టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ టీచర్స్ కు మేలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఇక మేనిఫెస్టో లో జనసేన ఇచ్చిన రెండు మూడింటిని యాడ్ చేస్తాం అని అన్నారు.
గతంలో అంగన్వాడీ టీచర్ల జీతం పెంచుతామని మేనిఫెస్టోలో చెప్పలేదు. కానీ అధికారంలోకి వచ్చాక వారి జీతాలను పెంచాము. ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో చెప్పకపోయినా అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ టీచర్ల జీవితాలను కచ్చితంగా పెంచుతామని నారా లోకేష్ తెలిపారు. ఇక వ్యూహం సినిమాని సైకో జగన్ నిర్మిస్తున్నాడు. ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలపై ఉన్నవి లేనివి అన్ని చూపిస్తూ వ్యూహం సినిమాను ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. ఆర్జీవి తరపున న్యాయపోరాటం చేస్తున్న నిరంజన్ రెడ్డి వైకాపా రాజ్యసభ సభ్యుడు. ఇక జగన్ మీద సినిమాలు తీయాలంటే కోడి కత్తి, బాబాయ్ హత్య కేసు, ప్యాలస్ కబ్జా అవినీతిపై తీయవచ్చు. అవన్నీ వదిలేసి చంద్రబాబుపై ఉన్నవి లేనివి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై కచ్చితంగా పోరాటం చేస్తాం అని నారా లోకేష్ తెలిపారు.