Vangaveeti Radha Krishna : వంగవీటి రాధాకృష్ణ దశ తిరగనుందా.. మంత్రి పదవి వరించే ఛాన్స్.!
Vangaveeti Radha Krishna : తెలుగుదేశం పార్టీ నాయకుడు, విజయవాడ మాస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధాను ఆంధ్రప్రదేశ్ మంత్రి , చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పరామర్శించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఐటి శాఖ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం విజయవాడ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా విజయవాడకు వచ్చిన అనంతరం తాడేపల్లిలోని పాతూరులోని వంగవీటి రాధాకృష్ణ ఇంటికి వెళ్లారు. ఇటీవల ఆయన ఆరోగ్యం కొంత క్షీణించగా,ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది.విజయవాడకు చెందిన అనేకమంది నాయకులు పార్టీలకు అతీతంగా వంగవీటి రాధాకృష్ణను పరామర్శించారు.
వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని అనేక మంది నాయకులు కోరుకున్నారు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ వంగవీటి రాధా ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో పర్యటించి కూటమి పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం చేశారు.వంగవీటి రంగా వారసుడిగా రాధాకృష్ణ ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం అంటే 2004లో కాంగ్రెస్ లో చేరి విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారు. ఆ తరువాత ఆయన ప్రజారాజ్యంలో చేరి 2009లో పోటీ చేసినా వైసీపీలో చేరి 2014లో బరిలోకి దిగారు. మళ్ళీ గెలవలేకపోయారు. టీడీపీలోకి 2019 ఎన్నికల ముందు వచ్చిన రాధాకు అపుడూ 2024లోనూ కూడా టికెట్ దక్కలేదు.
Vangaveeti Radha Krishna : వంగవీటి రాధాకృష్ణ దశ తిరగనుందా.. మంత్రి పదవి వరించే ఛాన్స్.!
టీడీపీ తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేసి బలమైన సామాజిక వర్గం మద్దతుని టీడీపీకి కట్టబెట్టారు.దీంతో వంగవీటికి ఏదో ఒక పదవి ఇవ్వబోతున్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం ఉంది.తాజాగా రాధాని కలిసిన నారా లోకేష్.. పార్టీ తరఫున ఒక కీలక హామీని ఇచ్చారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాకు ఎమ్మెల్యే కోటాలో ఒక సీటుని కేటాయిస్తామని స్పష్టం చేశారని ప్రచారం సాగుతోంది. ఇక ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో చూసుకుంటే బలమైన సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. రంగా వారసుడిగా రాధా రానున్న కాలంలో మరింతగా దూకుడు చేయడానికి ఆయనకు మంత్రి పదవి ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక రాధాని మంత్రిని చేయడం ద్వారా కోస్తాలో బలమైన కాపు సామాజిక వర్గానికి మరింతగా చేరువ కావాలని అది జమిలి ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఉపయోగపడుతుందని కూడా అలోచిస్తున్నారు అని అంటున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.