
#image_title
Vishnu Priya : బిగ్ బాస్ షోలో అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. గత ఆదివారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. షో మేకర్స్ ఇది ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ‘సెల్ఫ్ ఎలిమినేషన్’ అని చెప్పారు. ఆ తర్వాత, తాజా ఎపిసోడ్‌లో ఎనిమిదో వారం నామినేషన్ల సెగ్మెంట్ కనిపించింది, ఇందులో ఫైర్ లేదు. గత వారంతో పోల్చితే మొత్తం సీజన్‌లో గరిష్ట ఫైట్‌లు తక్కువగా ఉన్నాయి. అప్పుడు కూడా నామినేషన్ల జోరు కొరవడింది. విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరూ ప్రేక్షకుల మదిలో గౌరవాన్ని కోల్పోతున్నారు. వీరిద్దరూ తాజా బిగ్ బాస్ ప్రేమ పక్షులుగా ముద్ర వేసుకున్నారు.
నామినేషన్స్ ప్రక్రియ ముగియగానే సీరియల్ బ్యాచ్ మొత్తం అర్దరాత్రి ముచ్చట్లు పెట్టుకుంది. ఈ క్రమంలోనే విష్ణు, పృథ్వీ బాండింగ్ గురించి మాట్లాడింది యష్మీ. ముఖ్యంగా పృథ్వీని నేరుగా అడిగేస్తూ అతడికి సున్నితంగానే క్లాస్ తీసుకుంది. నీకు ఒక ఫ్రెండ్ గా చెబుతున్నాను.. నాకు మీద్దరిని చూసి విసుగొచ్చింది.. ఎక్కడ చూసిన మీరిద్దరే కలిసి కనిపిస్తున్నారు.. నీకు ఆమె స్పేస్ ఇవ్వట్లేదు.. చాలా ఇరిటేట్ వస్తుంది.. ఇది ఇండివీడ్యువల్ గేమ్.. ఏదైనా ఉంటే బయట చూసుకుందాం అని అంటుంది.మరీ ఓవర్ అయిపోతుంది అంటూ విష్ణు ప్రియను విమర్శించింది. అయితే ఈ విషయంలో నీకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని యష్మి పృధ్వీని అడిగింది. అదేం లేదని.. నేనేమి తన దగ్గరకు వెళ్ళడంలేదని.. తానే నా దగ్గరకు వస్తుందంటూ.. పృధ్వీ తేల్చేశాడు.
Vishnu Priya : విష్ణుప్రియకి కోలుకోలేని దెబ్బ వేసిన పృథ్వీ.. యష్మీ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా?
నాకు ఎలాంటి రిలేషన్ వద్దు.. నీవు ఒంటరిగా ఉండడమే నాకు ఇష్టం.. ఈ విషయం నీకు ముందే చెప్పాను. నా మీద నీకు ఏమైనా అనిపిస్తుందంటే చెప్పు ఇక్కడే ఆపేద్దాం అన్నాడు పృథ్వీ. దీంతో డన్ అని చెప్పింది విష్ణు. నీకు ఏమనిపిస్తుంది.. రియల్ గా ఫీల్ అవుతుందా అని మళ్లీ అడగ్గా.. నవ్వుతూనే వెళ్లిపోయింది విష్ణు. తన బెడ్ దగ్గరికి బాధగా వెళ్లగా.. నబీల్ ఏమైందని అడిగాడు. పృథ్వీ గురించి బాధపడుతున్నావా.. నీకు మంచి భర్త దొరుకుతాడులే అంటూ సలహా ఇచ్చాడు. ఇన్నిరోజులు వీరిమధ్య ఏదో ఉందిలే.. ఏదో ఉందిలే అనుకుంటున్న ఆడియన్స్ కు ఒక్క దెబ్బతోక్లారిటీ ఇచ్చేశాడు పృధ్వి రాజ్. తనపై కోటి ఆశు పెట్టుకున్న విష్ణు ప్రియ ప్రేమపై నీళ్లు చల్లాడు రాజ్. ఇక ఈ విషయాన్ని తట్టుకోలేకపోయింది విష్ణు. పైకి బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం బాగా ఇబ్బంది పడింది.
Ajith | తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే…
Cricketer | భారత క్రికెట్‌లో ఒకవైపు మహిళల జట్టు వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన ఆనందం నెలకొనగా, మరోవైపు క్రికెట్ ప్రపంచం…
BRS | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య…
cervical Pain | నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ ఫోన్ వాడకం పెరగడం, తప్పుడు…
Apple | రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు” ఈ మాట మనందరికీ బాగా…
Rose Petals | గులాబీ పువ్వులు అందం, సువాసనకు ప్రతీకగా నిలుస్తాయి. కానీ ఈ సుగంధ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే…
Ivy gourd | మన రోజువారీ ఆహారంలో కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్,…
November | నవంబర్ నెల చలికాలం ఆరంభమయ్యే ఈ సమయం ప్రకృతిలో మార్పులు తీసుకురావడమే కాదు, ఈ నెలలో జన్మించిన…
This website uses cookies.