NICL Assistant Recruitment : 500 ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 500 అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు NICL అధికారిక వెబ్‌సైట్ Nationalinsurance.nic.co.in కు లాగిన్ అయి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 24 – నవంబర్ 11 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు :
* అసిస్టెంట్ (క్లాస్-III కేడర్) : 500 (ఎస్సీ- 43; ఎస్టీ- 33; ఓబీసీ- 113; ఈడబ్ల్యూఎస్- 41; యూఆర్- 270)
* ఆంధ్రప్రదేశ్‌లో 21, తెలంగాణలో 12 ఖాళీలు ఉన్నాయి.
అర్హత : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం అవసరం.
వయస్సు : 01.10.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
పే స్కేల్ : నెలకు రూ.22,405- రూ.62,265.
ఎంపిక విధానం : ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) సబ్జెక్టులు : ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు).
ప్రశ్నల సంఖ్య : 100. మొత్తం మార్కులు 100.
పరీక్ష వ్యవధి : 60 నిమిషాలు.
మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) సబ్జెక్టులు : టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు)
ప్రశ్నల సంఖ్య: 200. మొత్తం మార్కులు 200.
పరీక్ష వ్యవధి : 120 నిమిషాలు.
NICL Assistant Recruitment : 500 ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు : విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, హైదరాబాద్/ రంగారెడ్డి, వరంగల్.
తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ ఎగ్జామినేషన్ కేంద్రాలు : హైదరాబాద్.
దరఖాస్తు ఫీజు : రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100.
ముఖ్య తేదీలు : ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : 24 అక్టోబర్ 2024.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ : నవంబర్ 11, 2024.
దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు : 24 అక్టోబర్ 2024 నుంచి 11 నవంబర్ 2024 వరకు.
ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 30 నవంబర్ 2024.
ఫేజ్-II ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 28 డిసెంబర్ 2024.
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
This website uses cookies.