Nara Lokesh : అప్పుడే 2000 కిమీలు నడిచాడా.. టైమ్ వేస్ట్ అంటున్న ప్రజలు.. అయినా లోకేశ్ తగ్గట్లేదుగా
Nara Lokesh : నారా లోకేశ్.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన టీడీపీలో కీలక నేత. టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు. అందుకే ఆయనకు అంత ప్రాధాన్యత. లోకేశ్ ను పార్టీలో పైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.. చంద్రబాబు గెలిచారు. ముఖ్యమంత్రి అయ్యారు. కానీ.. నారా లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. అయినా కూడా ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక నారా లోకేశ్ కూడా డల్ అయిపోయారు. కానీ.. 2024 ఎన్నికల కోసం చాలా రోజుల నుంచి లోకేశ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులో భాగంగానే నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. అది త్వరలోనే ఒక మైలురాయికి చేరుకోనుంది. ఏకంగా 2000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నారా లోకేశ్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. కావలి నియోజకవర్గంలో కొనసాగుతోంది. కొత్తపల్లి వద్ద రెండు వేల కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. లోకేశ్ పాదయాత్ర ప్రారంభించి ఆరు నెలలు దాటింది. జనవరి 27న నారా లోకేష్ కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఎక్కువగా రాయలసీమలో ఆయన పాదయాత్ర సాగింది.నారా లోకేష్ పాదయాత్ర మరో 2 వేల కిలోమీటర్లు సాగనుంది. ఇప్పటి వరకు ఆయన పాదయాత్ర ప్రారంభించి 153 రోజులు అవుతోంది. మొదట్లో లోకేశ్ పాదయాత్రకు భారీ రెస్పాన్స్ వచ్చింది. కానీ.. తర్వాత కాలంలో ఆయన పాదయాత్రకు ఆదరణ కరువైంది. పాదయాత్రలో భాగంగా కేవలం వైసీపీ ప్రభుత్వాన్నే విమర్శించడం పనిగా పెట్టుకున్నారు నారా లోకేష్.
Nara Lokesh : మరో 2 వేల కిలోమీటర్లు సాగనున్న నారా లోకేష్ పాదయాత్ర
సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడటం, తన పాదయాత్రలో జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకోవడంతో అసలు నారా లోకేష్ ను పట్టించుకునే నాథుడే లేడు. నిజానికి.. పాదయాత్ర అనేది ఒక చాలెంజింగ్. టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చినంత ఆదరణ.. నారా లోకేశ్ కు రావడం లేదు. ఆయన ఎంత పాదయాత్ర చేసినా జనాలు ఆయన్ను ఓన్ చేసుకోవడం లేదు. 2000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసినా నారా లోకేశ్ కు ఈ పాదయాత్ర వల్ల ఒరిగిందేం లేదు. యువగళం యాత్రను జనం పట్టించుకోవడం మానేశారు. అయినా కూడా నారా లోకేశ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. చూద్దాం మరి యువగళం యాత్ర ఇంకెన్ని సంచలనాలను సృష్టిస్తుందో?