Ys Jagan : NCLTలో వైఎస్ జగన్ పిటిషన్ తీర్పు రిజర్వ్..!
ప్రధానాంశాలు:
Ys Jagan : NCLTలో వైఎస్ జగన్ పిటిషన్ తీర్పు రిజర్వ్..!
Ys Jagan : హైదరాబాద్ Hyderabad నగరంలోని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ కేసులో తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మ అక్రమంగా షేర్లను బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. షేర్ల బదలాయింపును రద్దు చేయాలంటూ జగన్ తన తరపు న్యాయవాది ద్వారా పిటిషన్ వేశారు. దీనిపై ట్రైబ్యునల్ ముందూ వాదనలు రెండు రోజుల పాటు కొనసాగాయి.
Ys Jagan : NCLTలో వైఎస్ జగన్ పిటిషన్ తీర్పు రిజర్వ్..!
జగన్ తరపు న్యాయవాది వాదనల ప్రకారం, షర్మిల మరియు విజయమ్మ ఎటువంటి తన అనుమతి లేకుండా షేర్లను బదిలీ చేశారని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కంపెనీ చట్టం ప్రకారం షేర్ల బదిలీకి షేర్ హోల్డర్ సమ్మతిని తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని, కానీ ఆ ప్రాసెస్ పాటించలేదని ఆయన ఆరోపించారు. ఈ తరహా బదిలీలు ముందస్తుగా అవగాహన లేకుండా జరిగితే, వాటిని రద్దు చేయాల్సిందేనని వాదించారు.
దీనికి ప్రత్యుత్తరంగా షర్మిల, విజయమ్మ తరపు న్యాయవాది, షేర్ల బదిలీ పూర్తిగా చట్టపరమైనదిగా జరిగిందని, ఇది ఒక ముందస్తు ఒప్పందం ప్రకారం జరిగిందని స్పష్టం చేశారు. పక్షాల వాదనలు పూర్తి అయిన అనంతరం, ఎన్‌సీఎల్టీ తీర్పును రిజర్వు చేసింది. త్వరలోనే తుది తీర్పును వెలువడించే అవకాశం ఉంది.