Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..! వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..! వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :24 June 2025,7:20 pm

ప్రధానాంశాలు:

  •  Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..!

  •  ఎవరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదంటూ నీలిమ కన్నీరు

Neelima  : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “ నిత్య పెళ్లికూతురు ” అనే ఆరోపణలపై ఆమె స్వయంగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తాను 12 మంది పురుషులను వివాహం చేసుకున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఈ ఆరోపణల వల్ల తన వ్యక్తిగత జీవితమే కాకుండా కుటుంబ పరువు కూడా దెబ్బతిన్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Neelima నిత్య పెళ్లికూతురు ప్రచారంలో అసలు నిజమే లేదు 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ

Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..!

Neelima : ఎవరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదంటూ నీలిమ కన్నీరు

తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అరికట్టాలని కోరుతూ రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను సత్యంతో నిలబడుతున్నా, ఎవరి నుంచి సరైన సహాయం దొరకలేదని వాపోయారు. ఇప్పటికే కొంతకాలంగా తన జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోసం పలువురు రాజకీయ నాయకులను ఆశ్రయించినా ఫలితం లభించలేదని నీలిమ ఆవేదన వ్యక్తం చేసింది. తన పరువు, గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

“తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలతో నేను వెనక్కి తగ్గే మనిషిని కాదని , ఈ ఆరోపణలు నిజం కాకపోయినా వాటి వల్ల నాకు తీవ్రంగా నష్టం జరిగింది. ఎవరు ఇలా చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారు అన్నది త్వరలో బయట పడుతుంది. ఆ వరకు నా పోరాటం ఆగదు” అని ఆమె ధైర్యంగా తెలిపారు. ఆమె నిజానికీ న్యాయానికి అండగా నిలిచేందుకు సమాజం సహకరించాలని కోరారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది