Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 June 2025,6:42 pm

ప్రధానాంశాలు:

  •  Neelima : 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!

Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ అనే మహిళ వివాహ బంధాన్ని మోసాల సాధనంగా మార్చుకుని, అనేకమంది పురుషులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Neelima రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ విడాకులు తీసుకున్న వారే టార్గెట్

Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!

Neelima : కిలేడీ…

స్థానిక సమాచారం ప్రకారం, నీలిమ (వయసు సుమారు 37 సంవత్సరాలు) తాను ఒంటరిగా ఉన్నట్టు, మంచి కుటుంబానికి చెందినట్టుగా నటిస్తూ, వివిధ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు, పరిచయాల ద్వారా పురుషులను వలలో వేస్తూ పెళ్లిళ్లు చేసుకుంది. విడాకులు తీసుకున్న పురుషుని టార్గెట్ గా చేసుకొని వారి దగ్గర నుండి అందిన కాడికి దోచుకుంటుంది..ఎదురు మాట్లాడితే వారే తనని వేధిస్తున్నారంటూ బెదిరింపులుకి దిగుతుంది

ఇలా ఇప్పటివరకు 12 మంది పురుషులతో వివాహం చేసి, వారి నుండి లక్షలాది రూపాయల నగదు, బంగారం తీసుకుని మోసం చేసినట్టు బాధితుల ఫిర్యాదులతో తెలుస్తోంది. తాజాగా ఒక యువకుడు ఆమె తీరుపై అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది