New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్కర్ పాలసీ విధి విధానాలు ఇవే..!
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం పాలసీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా, అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీని అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. నూతన మద్యం పాలసీ ఎలా ఉండబోతోంది..? గతంలోలాగా మద్యం షాపులకు టెండర్లు పిలుస్తారా? గైడ్‌లైన్స్ ఎప్పటిలోగా రిలీజ్ చేసే అవకాశం..? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఇదే..!నూతన మద్యం పాలసీని తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం భావించగా, […]
ప్రధానాంశాలు:
New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్కర్ పాలసీ విధి విధానాలు ఇవే..!
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం పాలసీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా, అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీని అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. నూతన మద్యం పాలసీ ఎలా ఉండబోతోంది..? గతంలోలాగా మద్యం షాపులకు టెండర్లు పిలుస్తారా? గైడ్‌లైన్స్ ఎప్పటిలోగా రిలీజ్ చేసే అవకాశం..? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఇదే..!నూతన మద్యం పాలసీని తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం భావించగా, 2014 – 2024 మధ్య ఎక్సైజ్ పాలసీల మధ్య తేడా, ఎలా ముందుకు వెళ్ళాలన్న దానిపై రాష్ట్ర కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది.
New Liquor Policy కొత్తగా ప్రీమియం స్టోర్లు
వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకే మద్యం దుకాణాలు అప్పగించనుండటంతో మళ్లీ చట్ట సవరణ అవసరం కానుంది. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో నూతన మద్యం విధానం ఖరారు చేసే అవకాశం ఉంది. అదే రోజు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.అక్టోబర్ 4, 5 తేదీల నాటికి కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ప్రీమియం స్టోర్లనూ ప్రవేశపెట్టాలని సర్కార్ యోచిస్తోంది. అయితే ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని తలపెట్టని బ్రాండ్లను మాత్రమే అందుబాటులోకి తెస్తామని, నాణ్యమైన మద్యం అందుబాటులో ధరలో ఉండేలా కొత్త విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా 3396 వైన్ షాప్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించనున్నారు. అంటే మరో 396 దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు.ఆర్డినెన్సు జారీ, గవర్నర్ సంతకం ఇలా ఈ ప్రక్రియంతా పూర్తయ్యేందుకు కనీసం 3, 4 రోజులు సమయం పడుతుందని అంటున్నారు. సెప్టెంబరు 22, 23 తేదీల్లో నూతన మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడతాయని అంటున్నారు. ఆ తర్వాత మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో మద్యం విక్రయాలను అనుమతులు మంజూరు చేస్తారు.గతంలో అక్రమ మద్యం విధానంతో డ్రగ్స్, గంజాయికి బానిసలయ్యారు. మత్తుకు బానిసలైన వారిని రక్షించేలా కొన్ని చర్యలకు నిధులను కేటాయించనున్నాం అని కొల్లు రవీంద్ర అన్నారు.