Instagram Love : ఇన్‌స్టాగ్రామ్‌లో హాయ్ తో మొదలైన ప్రేమ.. చివరకు హత్య చేసేవరకు వెళ్ళింది !!

 Authored By sudheer | The Telugu News | Updated on :16 February 2026,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Instagram Love : ఇన్‌స్టాగ్రామ్‌లో హాయ్ తో మొదలైన ప్రేమ.. చివరకు హత్య చేసేవరకు వెళ్ళింది !!

Instagram Love : సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి ఎంతటి ప్రమాదకరంగా మారుతాయో చెప్పడానికి మహారాష్ట్రకు చెందిన యువతి సియా (33) ఉదంతమే ఒక నిదర్శనం. ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) పరిచయమైన సమీర్ అనే వ్యక్తితో ఆమె ప్రేమలో పడింది. అతనిపై ఉన్న నమ్మకంతో తన స్వస్థలాన్ని వదిలి భోపాల్‌కు చేరుకుంది. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాతే సమీర్‌కు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారనే నమ్మలేని సత్యం బయటపడింది. ‘హాయ్’ అనే చిన్న సందేశంతో మొదలైన ఈ ప్రేమకథ, చివరకు ఒక సెప్టిక్ ట్యాంక్‌లో శవమై తేలడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Love : ఇన్‌స్టాగ్రామ్‌లో హాయ్ తో మొదలైన ప్రేమ..చివరకు హత్య చేసేవరకు వెళ్ళింది !!

Love : ఇన్‌స్టాగ్రామ్‌లో హాయ్ తో మొదలైన ప్రేమ..చివరకు హత్య చేసేవరకు వెళ్ళింది !!

Instagram Love రూ. 5 లక్షల భరణం ఇవ్వాలని డిమాండ్

సమీర్ అసలు రూపం తెలిసిన తర్వాత సియా అతడిపై పెళ్లి కోసం ఒత్తిడి తేవడం ప్రారంభించింది. లేనిపక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, రూ. 5 లక్షల భరణం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వారి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే విసుగు చెందిన సమీర్, ఆమెను అడ్డు తొలగించుకోవాలని కిరాతక నిర్ణయం తీసుకున్నాడు. తీవ్ర వాగ్వాదం జరుగుతుండగా ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన కుటుంబ సభ్యుల సాయంతో మృతదేహాన్ని ఒక ఇనుప పెట్టెలో కుక్కి, గుట్టుచప్పుడు కాకుండా సమీపంలోని ఖాళీ స్థలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు.

Instagram Love సెప్టిక్ ట్యాంక్ నుండి వెలువడిన భరించలేని దుర్వాసన

సెప్టిక్ ట్యాంక్ నుండి వెలువడిన భరించలేని దుర్వాసనతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ట్యాంక్‌ను తవ్వగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైంది. అయితే, ఆమె చేతిపై ఉన్న దీపం పచ్చబొట్టు (Tattoo) మరియు పుట్టిన తేదీ ఆధారంగా పోలీసులు ఆమెను సియాగా గుర్తించారు. సమీర్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతనికి సహకరించిన తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆన్‌లైన్ పరిచయాల విషయంలో యువత ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తోంది. నమ్మకమే ప్రాణాల మీదకు తెస్తుందని ఈ విషాదాంతం మరోసారి నిరూపించింది.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి