Wife : ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Wife : ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..!

 Authored By ramu | The Telugu News | Updated on :22 June 2025,4:15 pm

ప్రధానాంశాలు:

  •  ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..!

  •  ఇలాంటి మహిళల వల్లే ..మహిళాలోకానికి చెడ్డ పేరు వస్తుంది.. అసలు ఏంజరిగింది

Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని, భార్య ఐశ్వర్య, ఆమె తల్లి, ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ కలిసి హత్య చేయడం ఇప్పుడు వార్తల్లో నిలిచేలా చేసింది. పెళ్లయిన కొన్ని రోజులకే ఈ ఘాతుకం జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడు గద్వాల జిల్లాకు చెందిన వాసి.

Wife ఛీ ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా పారాణి ఆరక ముందే భర్త

Wife : ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..!

Wife : పెళ్లి చేసుకున్న కొద్దీ గంటల్లోనే భర్తను చంపేసిన నవ వధువు

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయం ఏంటి అంటే.. ఐశ్వర్యకు ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌తో వివాహేతర సంబంధం ఉండొచ్చన్నఅనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంబంధం కారణంగా తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి భర్త అనే ప్రేమ , గౌరవం కూడా లేకుండా తేజేశ్వర్‌ను హత్యకు ప్లాన్ చేసింది. తేజేశ్వర్ సెల్‌ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా, ఐశ్వర్య, బ్యాంక్ మేనేజర్ మధ్య తరచూ మాట్లాడిన రికార్డులు లభించాయి. ఈ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

ప్రస్తుతం ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే హత్య కేసులో కీలకపాత్ర పోషించినట్లు అనుమానిస్తున్న ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసు పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్ళైన కొద్దీ రోజులకే ఈ ఘాతుకం జరగడం, మానవ సంబంధాల విలువ తగ్గిపోతున్న తీరును వెలుగులోకి తీసుకొచ్చింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది