ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఈసీ డేరింగ్ డెసిషన్.. ఇది కనుక అమలయితే ఏపీ అల్లకల్లోలమే?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి తీరాలని ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ చాలా గట్టిగా కోరుకున్నాడు. అయితే సీఎం జగన్ మాత్రం నిమ్మగడ్డ ఉన్నంత వరకు ఎన్నికలకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఎన్నికల కమీషనర్‌ గా నిమ్మగడ్డ విషయంలో జగన్ చాలా అసంతృప్తితో ఉన్నాడు. ఇలాంటి సమయంలో నిమ్మగడ్డ మరియు జగన్ ల మద్య వార్‌ ఏ రేంజ్ లో సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోర్టుల్లో అనేక సార్లు వాదనలు విచారణలు జరిగాయి. మొన్నటి వరకు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతున్న కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు అనుమతులు ఇవ్వని కోర్టు ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దాంతో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ఈ సమయంలో నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు సరిగ్గా జరిగేందుకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంని అంటున్నారు. అదే కనుక నిజం అయితే ఖచ్చితంగా జగన్‌ షాక్ తినే అవకాశం ఉంది.

Nimmagadda ramesh kumar Daring Decision on Local Body Elections

ఆయన ఉంటే కష్టం

ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కువ శాతం ఎన్నికల కమీషనర్‌ చేతిలోకి వెళ్లి పోతాయి. ఎన్నికల కోడ్‌ అమలు ఉంటే సీఎం కూడా ఈసీకి భయపడాల్సిందే. ఎవరిని తొలగించాలన్నా కొత్తగా నియమించాలన్నా కూడా ఖచ్చితంగా ఎస్ ఈసీ దే తుది నిర్ణయం అనే విషయం తెల్సిందే. ఎన్నికల నిర్వహణకు ఎవరు ఎలాంటి ఆటంకం కలిగిస్తారని అనిపించినా అనుమానం కలిగినా కూడా వారిని తొలగించే అర్హత ఈసీకి ఉంది. అందుకే ఇప్పుడు డీజీపీ సవాంగ్ గౌతమ్ ను తొలగించాలనే నిర్ణయానికి నిమ్మగడ్డ రమేష్ వచ్చారు అంటూ ప్రచారం జరుగుతోంది. జగన్ కు అత్యంత ఆప్తుడిగా నమ్మకస్తుడిగా ఉన్న సవాంగ్ ను ఎన్నికల పేరుతో తప్పిస్తే ఖచ్చితంగా జగన్ కు ఇబ్బందులు తప్పవంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ తో ఢీ కి సిద్దం

జగన్‌ ను ఎదుర్కొని ఎన్నికలను నిర్వహించాలంటే సాధ్యం అయ్యే పని కాదు. అయినా కూడా నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ విషయంలో నిమ్మగడ్డ మొండి ధైర్యంకు అంతా కూడా హ్యాట్సాఫ్‌ అంటున్నారు. జగన్‌ తో పెట్టుకోవడం వైకాపా తో ఢీ కొట్టడం అంటే చాలా సాహసంతో కూడిన పని. అయినా కూడా నిమ్మగడ్డ మాత్రం పంథంకు పోయి జగన్‌ ను ఢీ కొట్టడం కోసం ఏకంగా డీజీపీనే విధుల నుండి తొలగించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇదే కనుక జరిగితే జగన్ ఈగో మరింత హర్ట్ అయ్యి పరిస్థితులు మరింతగా అదుపు తప్పడం ఖాయం అంటున్నారు. ఎన్నికల విధులకు ఉద్యోగులను హాజరు కాకుండా అనధికారికంగా జగన్‌ ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి నిమ్మగడ్డ తీరు చూస్తుంటే అంతా కూడా ఆశ్చర్య పోతున్నారు. డీజీపీని తప్పిస్తే ఖచ్చితంగా వైకాపా అల్లకల్లోలం సృష్టించే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

5 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

8 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

12 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

15 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

17 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago