
pawan kalyan పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు ఆశపడుతుంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది దర్శకుడిగా.. నిర్మాతగా.. ఆయన కి జంటగా నటించే హీరోయిన్స్ సహా.. చిన్న పాత్ర దొరికినా చాలనుకునే నటీ నటులు.. ఇలా ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ తో లైఫ్ లో ఒక్కసారైనా సినిమా చేసే అదృష్టం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలంటే అంత సులభం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత సులభంగా ఎవరికీ డేట్స్ ఇవ్వడు అంటారు. ఇక దర్శకుడిగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ అంటే కథ తో ఆయనని మెప్పించగలగాలి.
ఇక్కడ నిర్మాత కి దర్శకుడి కి ఒకే ఫార్ములా అమలవుతుంది. అది ఏంటంటే పవన్ కళ్యాణ్ కి రెమ్యూనరేషన్ ఆశ చూపి నిర్మాత డేట్స్ తెచ్చుకోలేడు. ఎందుకంటే డబ్బుకోసం లొంగే తత్వం పవన్ కళ్యాణ్ ది కాదు. ఇక ఏ కథ పడితే ఆ కథ చేసేద్దాం అని కూడా దర్శకుల్ని ఎంకరేజ్ చేయడు. పవన్ కళ్యాణ్ నటించే కథ లో కమర్షియల్ అంశాలుంటే సరిపోదు. ఆ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చేలా ఉండాలి. ముఖ్యంగా నిర్మాత నష్టపోకూడదన్నది పవన్ కళ్యాణ్ తత్వం. అందుకే ఏళ్ళ తరబడి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఆతృతగా ఎదురు చూస్తుంటారు.
అయితే పవన్ కళ్యాణ్ ని ఒకసారి మెప్పిస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ అవకాశాం ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించడు. అందుకు ఉదాహరణ త్రివిక్రం.. హరీష్ శంకర్ లాంటి వాళ్ళే. అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఫీలవుతున్నారు మన దర్శకులు. ఆయా దర్శకుడి కెరీర్ లో పవన్ కళ్యాణ్ తో మూడవ సినిమా చేస్తే ఇక ఇండస్ట్రీలో తిరుగులేని దర్శకుడిగా స్టార్ డం ని సంపాదించుకుంటాడట. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా జల్సా. ఈ సినిమా త్రివిక్రమ్ కి దర్శకుడిగా మూడవ సినిమా. అలాగే హరీష్ శంకర్ కి కూడా గబ్బర్ సింగ్ మూడవ సినిమా. ఇప్పుడు అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ తెరకెక్కించబోతున్న సాగర్ చంద్రకు పవన్ కళ్యాణ్ తో మూడవ సినిమా. కాబట్టి ఈ దర్శకుడి తలరాత కూడా మారిపోతుందని చెప్పుకుంటున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.