Nimmagadda Ramesh: అమ్మో నిమ్మగడ్డ తెలివి – ‘వైఎస్ వల్లే నేను ఇలా ఉన్నాను’ అనడం వెనక టాప్ సీక్రెట్ ?

Nimmagadda Ramesh: ఏపీలో అధికార వైకాపా కు ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్ చుక్కలు చూపిస్తున్నారు. మరో వైపు వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు చివరకు సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ను టార్గెట్‌ చేసేలా మాట్లాడుతున్నారు. రిటైర్మెంట్ వయసు దగ్గర పడ్డ ఈ సమయంలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సైలెంట్ గా వెళ్లి పోతే అంతా సాఫీగా సాగిపోయేది. కాని ఆయన స్థానిక సంస్థల ఎన్నిలక విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరించి అధికార వైకాపాను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నాడు. దాంతో సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డికి చాలా కోపంగా ఉంది. ఇలాంటి సమయంలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వైకాపా నాయకులను ఆలోచనల్లో పడేశాయి.

nimmagadda ramesh kumar interesting comments on ys rajashekhar reddy

Nimmagadda Ramesh: వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గొప్ప వ్యక్తి..

ఇటీవల జిల్లాల పర్యటనలో పాల్గొన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ తనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి అంటే అమితమైన గౌరవం అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అన్నాడు. ఆయన హయాంలో పని చేసే సమయంలో ప్రతి ఒక్కరికి కూడా భావ స్వేచ్చ హక్కును ఇచ్చే వారు. ఆయన ప్రతి ఒక్కరి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే వారు. ఏ ఒక్క సందర్బంలో కూడా ఆయన వద్ద పని చేస్తున్నప్పుడు ఇబ్బంది పడింది లేదని చెప్పుకొచ్చాడు. నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చి పని చేసుకునే అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి.

నిమ్మగడ్డ వ్యాఖ్యలతో వైకాపా సైలెంట్‌…

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో తనకు పూర్తి స్వేచ్చ దక్కిందని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలతో వైఎస్‌ జగన్‌ అభిమానులు మరియు వైకాపా నాయకులు సైలెంట్‌ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇండైరెక్ట్‌ గా జగన్ తీరును తప్పుబట్టడంతో పాటు వైకాపా నాయకుల అత్యుత్సాహంకు కౌంటర్ ఇచ్చాడు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నిమ్మగడ్డ వ్యాఖ్యలతో కొందరు అయ్యో ఇన్ని రోజులు పెద్దాయన్ను ఇబ్బంది పెట్టాం. ఆయనకు మన పెద్దాయన అంటే ఇంత గౌరవమా అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి నిమ్మగడ్డ ప్లాన్‌ ఇలా వర్కౌట్‌ అయ్యిందని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

8 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

9 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

11 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

13 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

15 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

17 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

18 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

19 hours ago