nimmagadda ramesh kumar interesting comments on ys rajashekhar reddy
nimmagadda ramesh : ఏపీలో అధికార వైకాపా కు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ చుక్కలు చూపిస్తున్నారు. మరో వైపు వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు చివరకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టార్గెట్ చేసేలా మాట్లాడుతున్నారు. రిటైర్మెంట్ వయసు దగ్గర పడ్డ ఈ సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైలెంట్ గా వెళ్లి పోతే అంతా సాఫీగా సాగిపోయేది. కాని ఆయన స్థానిక సంస్థల ఎన్నిలక విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరించి అధికార వైకాపాను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నాడు. దాంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా కోపంగా ఉంది. ఇలాంటి సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైకాపా నాయకులను ఆలోచనల్లో పడేశాయి.
nimmagadda ramesh kumar interesting comments on ys rajashekhar reddy
ఇటీవల జిల్లాల పర్యటనలో పాల్గొన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ తనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అమితమైన గౌరవం అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అన్నాడు. ఆయన హయాంలో పని చేసే సమయంలో ప్రతి ఒక్కరికి కూడా భావ స్వేచ్చ హక్కును ఇచ్చే వారు. ఆయన ప్రతి ఒక్కరి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే వారు. ఏ ఒక్క సందర్బంలో కూడా ఆయన వద్ద పని చేస్తున్నప్పుడు ఇబ్బంది పడింది లేదని చెప్పుకొచ్చాడు. నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చి పని చేసుకునే అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తనకు పూర్తి స్వేచ్చ దక్కిందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో వైఎస్ జగన్ అభిమానులు మరియు వైకాపా నాయకులు సైలెంట్ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇండైరెక్ట్ గా జగన్ తీరును తప్పుబట్టడంతో పాటు వైకాపా నాయకుల అత్యుత్సాహంకు కౌంటర్ ఇచ్చాడు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నిమ్మగడ్డ వ్యాఖ్యలతో కొందరు అయ్యో ఇన్ని రోజులు పెద్దాయన్ను ఇబ్బంది పెట్టాం. ఆయనకు మన పెద్దాయన అంటే ఇంత గౌరవమా అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి నిమ్మగడ్డ ప్లాన్ ఇలా వర్కౌట్ అయ్యిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
This website uses cookies.