Anil Kumar Yadav : వైఎస్ జగన్ ను ఎవ్వరు ఆపలేరు – అనిల్ కుమార్ యాదవ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anil Kumar Yadav : వైఎస్ జగన్ ను ఎవ్వరు ఆపలేరు – అనిల్ కుమార్ యాదవ్

 Authored By ramu | The Telugu News | Updated on :1 July 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Anil Kumar Yadav జులై 3న నెల్లూరు నగరానికి మాజీ సీఎం రావడం తథ్యం

Anil Kumar Yadav : ఏపీలో అధికారాన్ని కోల్పోయిన తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస రాజకీయ ఎదురుదెబ్బలు తప్పడం లేదు. కూటమి సర్కార్ పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్లి ఎండగట్టాలనే ప్రయత్నంలో భాగంగా జగన్ జూలై 3న నెల్లూరు జిల్లాకు పర్యటన చేపట్టాలని సిద్ధమయ్యారు. జైల్లో ఉన్న తన నమ్మిన నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలవాలన్న ఆయన నిర్ణయానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. పోలీసు విభాగం 100 మందికి మించి పర్యటనలో పాల్గొనరాదని స్పష్టం చేయడంతో వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది.

Anil Kumar Yadav వైఎస్ జగన్ ను ఎవ్వరు ఆపలేరు అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav : వైఎస్ జగన్ ను ఎవ్వరు ఆపలేరు – అనిల్ కుమార్ యాదవ్

YS Jagan : నెల్లూరు లో జగన్ ను ఎవ్వరు అడ్డుకోలేరు – అనిల్ కుమార్

వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పోలీసులకు పర్యటనకు 10 రోజుల ముందే సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని, ఆ ప్రక్రియలో కాలయాపన కొనసాగుతుందన్నారు. పోలీసులు ఇస్తున్న షరతులన్నీ జగన్ పర్యటనను అడ్డుకోవడానికి కావాలని చేస్తున్న కుట్రలేనని ఆయన ఆరోపించారు. భద్రతా పరంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది లేని ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పటికీ, అధికారుల స్పందన సంతృప్తికరంగా లేదన్నారు. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా జూలై 3న జగన్ పర్యటన ఖచ్చితంగా జరుగుతుందని, ప్రజా ప్రభంజనం నెల్లూరులో మోగిపోతుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక మరోవైపు హెలిప్యాడ్ ఏర్పాటుపైనా వైసీపీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. హెలికాఫ్టర్ దిగేందుకు తగిన స్థలాల కోసం స్థానికంగా గాలింపు జరిపినా, టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒత్తిడి వల్లే భూమి యజమానులు స్థలాలు ఇవ్వడానికి ముందుకురావడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో హెలిప్యాడ్ స్థలం ఖరారవ్వకుండా ఆలస్యం జరుగుతోంది. మొత్తంగా చెప్పాలంటే, జగన్ నెల్లూరు పర్యటన చుట్టూ సర్కార్, పోలీసు వ్యవస్థల నుంచి అవరోధాల పంజా కొనసాగుతుండగా, వైసీపీ మాత్రం దృఢంగా ముందుకు సాగుతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది