ఆంధ్రప్రదేశ్ కాదు… నేరాంధ్రప్రదేశ్ : సంచలన వ్యాఖ్యలు చేసిన ధూళిపాళ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

ఆంధ్రప్రదేశ్ కాదు… నేరాంధ్రప్రదేశ్ : సంచలన వ్యాఖ్యలు చేసిన ధూళిపాళ

Dhulipalla narendra : చంద్రబాబునాయుడుపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బురదజల్లడం మానుకోవాలని మాజీ శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర పేర్కొన్నారు. గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… కక్షలు, కార్పణ్యాలతో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా?. జంగిల్ రాజ్ గా రాష్ట్రాన్ని మార్చారు. Dhulipalla narendra : ఆయనేమి అమాయకుడు కాదు దళితుల భూములను, ఇళ్ల పట్టాలకు, బినామీ కంపెనీలకు ధారాదత్తం చేయడంపై మాట్లాడే దమ్ము ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఉందా?. ఆళ్ల […]

 Authored By brahma | The Telugu News | Updated on :19 March 2021,11:20 am

Dhulipalla narendra : చంద్రబాబునాయుడుపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బురదజల్లడం మానుకోవాలని మాజీ శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర పేర్కొన్నారు. గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… కక్షలు, కార్పణ్యాలతో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా?. జంగిల్ రాజ్ గా రాష్ట్రాన్ని మార్చారు.

Dullipalla Narendra

Dhulipalla narendra : ఆయనేమి అమాయకుడు కాదు

దళితుల భూములను, ఇళ్ల పట్టాలకు, బినామీ కంపెనీలకు ధారాదత్తం చేయడంపై మాట్లాడే దమ్ము ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఉందా?. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీ ఎదుట తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు మీద అనేక విమర్శలు చేశారు. విమర్శలు చేసే ముందు వారి గురించి ఆత్మావలోకనం చేసుకోవాలి. జీవో నెంబర్ 41..ని ఉదహరిస్తూ ఫిర్యాదు చేశారు. 17.2.2016 వ తేదిన చేసిన జీవో. రాష్ట్ర రాజధానిని దృష్టిలో ఉంచుకుని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం, భూ సమీకరణ కోసం ఇచ్చిన జీవో. ఈ జీవోతో దళితులకు అన్యాయం జరిగిందనడంలో అర్థంలేదు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంగబలం, అర్దబలం కలిగిన వ్యక్తి. అన్యాయం జరిగి ఉంటే ఇన్నాళ్లు ఊరుకుండే వ్యక్తి కాదు. సుప్రీం కోర్టులో కేసులు వేసిన ఘనమైన చరిత్ర ఆయనకుంది. జీవో ఇచ్చేటప్పుడు ఎందుకు నోరు మెదపలేదు. ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన జీవోపై ఇన్నాళ్లు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడటంలో అర్థంలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైంది. కొత్తగా ఎమ్మెల్యే అయినట్లు, ఈ జీవో గురించి ఏమీ తెలియనట్లు మాట్లాడున్నారు.

దళితుల హక్కుల కోసం పోరాడుతున్నట్లుగా నటిస్తున్నారే తప్ప మనస్ఫూర్తిగా దళితులపై ప్రేమ లేదు. ఆయన ధరించిన ముసుగు గురించి అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడును అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచనలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు.ఇన్నాళ్లు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడడంలో పెద్ద కుట్ర ఉంది. ఇన్నాళ్లు గుర్తుకు రాని దళితులు ఇప్పడు ఎలా గుర్తుకు వచ్చారు?

alla ramakrishna reddy

వాళ్ళేమి దైవాంస సంభూతులు కాదు

రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. జగన్ పై ఉన్న కేసులకు సహకరిస్తూ సజావుగా ఎంక్వైరీలు జరిపితే ప్రజా ధనం వృధా కాకుండా ఉంటుంది. గురిగింజ సామెత జగన్ కు బాగా వర్తిస్తుంది. తన మచ్చలను చూసుకోకుండా ఇతరుల మచ్చలను చూపిస్తుంటారు. ఎదుటివారి మీద బురద చల్లడం ఎంతవరకు సహేతుకం? ఎన్నికలకు ముందు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఆ తరువాత ఏరుదాటి తెప్ప తగలేశారు. వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారు.

దైవాంస సంభూతులులాగ ఆకాశం నుంచి దిగి వచ్చినట్లు మాట్లాడటం హాస్యాస్పదం. ఈ కేసులన్నీ జగన్నాటకంలో ఒక పాత్ర. జగన్ చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో సామాన్యుడు కూడా అధేవిధంగా ఉపయోగించుకుంటారు. మీలాంటి అక్రమార్కులు, కుట్రదారులను ఎదుర్కొనేందుకు మేం పోరాటం చేస్తాం. నియోజకవర్గ ప్రజలు క్షమాపణ చెప్పకుండా బరితెగించి మాట్లాడటం హాస్యాస్పదం. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు మీ గురించి మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర హెచ్చరించారు.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది