Pawan Kalyan and Lokesh : ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు అయింది. నాలుగేళ్ల నాలుగు నెలల పాలన ఇంకా మిగిలి ఉంది. సంఖ్యాబలంగా చూసినా ఏపీలోని 175 మంది ఎమ్మెల్యేలలో 164 మంది కూటమికి చెందిన వారే ఉన్నారు. అత్యంత పటిష్టంగా కూటమి సర్కార్ ఉంది. మరి ఈ సమయంలో సీఎం ఎవరు ? చంద్రబాబు తరువాత వారసుడు అనే చర్చలు ఊపందుకున్నాయి. అసలు ఇటువంటి చర్చలు ఎందుకు జరుగుతున్నాయన్నది ఆశ్చర్యం కలిగించే పరిణామమే. ఈ నెల 8న విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ రాక సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాన్ మోడీతో పాటు ఫ్లెక్సీల మీద లోకేశ్ ఫోటోలు కనిపించినప్పటి నుంచి అని అంతా అంటున్నారు.
మరోవైపు కొన్ని రోజులుగా లోకేశ్ ని ఉప ముఖ్యమంత్రి చేయాలని టీడీపీ క్యాంప్ ప్రచారాన్ని హోరెత్తించింది. దాని మీద అధినాయకత్వం అలెర్ట్ అయి ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతానికి సద్దుమణిగింది. అయినా సీనియర్ నేతలు అడపాతడపా దీని మీద మాట్లాడుతూనే వస్తున్నారు.
ఈ క్రమంలోనే సినీ ప్రముఖుడు, వర్తమాన రాజకీయాలు విశ్లేషించే తమ్మారెడ్డి భరద్వాజ తన యూట్యూబ్ ఛానల్ లో స్పందిస్తూ.. తనకు ఒక కల వచ్చిందని అందులో పవన్ సీఎం లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయ్యారని చెబుతూ ఏపీ రాజకీయాల్లో సంచలన చర్చకు తెర తీశారు. దీంతో మళ్లీ అందరూ దీని మీద అంతా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది.అసలు అలా జరిగే వాతావరణం ఉందా అన్నది కూడా చర్చకు వస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ కూటమికి ఎమోషనల్ స్ట్రెంగ్త్ గా ఉనారు.
కానీ రాజకీయాలు అధికారం అంటే నంబర్ గేం ఆ విధంగా చూస్తే ఈ రోజుకు ఈ రోజు సీఎం గా లోకేష్ ని చేసే చాన్స్ టీడీపీకి కచ్చితంగా ఉంది అని అంటున్నారు. మొత్తం అసెంబ్లీలో ఆ పార్టీ బలం 134 మంది ఎమ్మెల్యేలు అన్నది తెలిసిందే. ఇక పవన్ ఛాన్సెస్ విషయానికి వస్తే ఆయన సీఎం కావాలీ అంటే ఒకటి వచ్చే ఎన్నికల్లో కూటమితో పొత్తులో ఉంటూనే పెద్ద సంఖ్యలో సీట్లు కోరాలి. అవన్నీ గెలిచి కూటమిలో సంఖ్యాపరంగా బలంగా ఉంటే అపుడు సీఎం పోస్టు షేరింగ్ కోరవచ్చు అని అంటున్నారు. అంటే ఈ టెర్మ్ లో కుదరదు అనే అంటున్నారు.
Union Budget 2025 : రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.. కేంద్ర బడ్జెట్ 2025లో కిసాన్ క్రెడిట్…
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman లోక్ సభలో దేశ బడ్జెట్…
Union Budget 2025 : బడ్జెట్లో కేంద్రం గుడ్ న్యూస్లు ప్రకటిస్తుంది.విద్యారంగం, విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో…
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman budget వరుసగా 8వ సారి…
Anti-Cancer Diet : మనకు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఎన్నో ఉన్నాయి. అటువంటి పండ్లలో ముఖ్యమైన పండు 'కివి'…
Copper Sun : ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో రాగితో చేసిన సూర్య ప్రతిమను ఇంటికి పెడుతున్నారు. దీనికి…
Nirmala Sitharaman : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్టాఫీసుల్లో ఖాతాదారులకు ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ (RD) పథకంతో సహా…
Black Coffee : ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా తమ రోజువారి దినచర్యను కాఫీ తోటి లేదా టీ తోని…
This website uses cookies.