Nagababu : నాగ బాబుకి ఎమ్మెల్సీ.. పనిమంతుడైతేనే ఇక్కడ కుల బంధు ప్రీతి ముఖ్యం కాదు..!
ప్రధానాంశాలు:
Nagababu : నాగ బాబుకి ఎమ్మెల్సీ.. పనిమంతుడైతేనే ఇక్కడ కుల బంధు ప్రీతి ముఖ్యం కాదు..!
Nagababu : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ప్రెస్ మీట్ లో నాగ బాబుకి ఎమ్మెల్సీ ఇస్తామని అన్నారు. అంతేకాదు ఆయన పనిమంతుడా కాదా అన్నది ముఖ్యమని.. నాతో పాటు పార్టీ కోసం సమానంగా పనిచేశాడు. ఐతే కుల, బంధు ప్రీతి కాదు పనిమంతుడా కాదా అన్నదే ముఖ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు.
Nagababu మంత్రి అవుతారా లేదా అన్నది తర్వాత..
ఎవరికి ప్రతిభ ఉంటుందో వారిని చూసి పదవులు ఇస్తాం. నాగ బాబు ముందు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారు. మంత్రి అవుతారా లేదా అన్నది తర్వాత చర్చిస్తామని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఐతే నాగ బాబుకి మంత్రి పవది ఇస్తున్నారని ఈమధ్య వార్తలు రాగా దానిపై పవన్ కళ్యాణ్ ముందు ఎమ్మెల్సీ అక్కడ పనిమంతుడైతేనే మంత్రి పదవి అన్నట్టుగా చెప్పుకొచ్చారు.
ఐతే ప్రతిభ ఉన్న వారికే అవకాశమని.. ఇక్కడ బంధు ప్రీతి లేదని.. జనసేన పార్టీకి నాతో సమానంగా నాగ బాబు పనిచేశారని అన్నారు పవన్ కళ్యాణ్. Pawan Kalyan, Naga Babu, MLC Ticket, AP, Deputy CM