Pawan Kalyan : ముఖ్యమంత్రి పదవిపై ఇంకా పోలవరం ప్రాజెక్టుపై పవన్ సంచలన వ్యాఖ్యలు..!!
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారహీయాత్ర ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. మొదటిరోజు కత్తిపూడి నియోజకవర్గంలో వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీపై సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాకుండా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈసారి తనని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరు అడ్డుకోలేరని అన్నారు. ఇక ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒంటరిగారా విడిగా పోటీ చేయ్ అని అంటారు.
నేను ఎలా పోటీ చేయాలో మీరు ఎలా నిర్ణయిస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు కుండ బద్దలు కొట్టినట్లు చెబుతాను. కానీ ఒక్క విషయం వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతాను. దానికోసం ఎన్ని వ్యూహాలైన అనుసరిస్తాం. ముఖ్యమంత్రి పదవిని ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం. ముఖ్యమంత్రి పదవి మనకు రావాలంటే ఏం చేయాలి..? ఎలా వెళ్లాలి..? అనేది మాట్లాడుకుందాం అంటూ పవన్ కళ్యాణ్ తొలి రోజు వారాహి యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే జనసేన రావాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రజాధనాన్ని దోచుకుంటుందని ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి తనకు చెప్పినట్లు తెలియజేశారు. ఏదేమైనా తొలి రోజు వారాహి యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.