Pawan kalyan : ఆ రెండు నియోజకవర్గాల పై కన్నేసిన పవన్ కళ్యాణ్.. ఆ రెండు సీట్లు మాకే కావాలంటూ డిమాండ్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan kalyan : ఆ రెండు నియోజకవర్గాల పై కన్నేసిన పవన్ కళ్యాణ్.. ఆ రెండు సీట్లు మాకే కావాలంటూ డిమాండ్ ..!

Pawan kalyan : ఏపీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. మళ్లీ అధికారంలోకి రావాలని వైయస్సార్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటు పై దృష్టి పట్టాయి. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని అనుకుంటున్న రెండు నగరాల్లోని నియోజకవర్గాలపై కన్నేసినట్టు సమాచారం. ఆ రెండు నియోజకవర్గాలు ఏంటంటే గుంటూరు […]

 Authored By anusha | The Telugu News | Updated on :11 January 2024,9:00 pm

Pawan kalyan : ఏపీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. మళ్లీ అధికారంలోకి రావాలని వైయస్సార్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటు పై దృష్టి పట్టాయి. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని అనుకుంటున్న రెండు నగరాల్లోని నియోజకవర్గాలపై కన్నేసినట్టు సమాచారం. ఆ రెండు నియోజకవర్గాలు ఏంటంటే గుంటూరు పశ్చిమం, విజయవాడలో ఒక సీటు అని తెలిసింది. విజయవాడలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ తూర్పు లో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రాతినిధ్యం వహిస్తుండగా, విజయవాడ సెంట్రల్ పశ్చిమంలో వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు ఉన్నారు. వీటిల్లో తూర్పు నియోజకవర్గాన్ని వదిలేస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లేదా పశ్చిమంలో కచ్చితంగా జనసేన గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారట.

అయితే సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు. కాబట్టి ఇక్కడి నుండి జనసేనకు టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న రెడీగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా టికెట్ దొరకడం అనుమానమే. అయితే ఏవో కారణాలు చెప్పి రెండు నియోజకవర్గాల్లో టికెట్లు కుదరదని టీడీపీ అంటే పవన్ కూడా మాకు కుదరదని ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి చెప్పినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

మూడు సీట్లలో కచ్చితంగా ఒక సీటు ఇచ్చి తీరాల్సిందే అని పవన్ చెప్పారట. దీంతో టీడీపీకి ఏ నియోజకవర్గంలో కోతపడుతుందో తెలియని పరిస్థితి. ఇది ఇలా ఉండగా గుంటూరులోని రెండు తూర్పు పశ్చిమ నియోజకవర్గం కచ్చితంగా ఒక దానిలో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారట. గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ తో ప్రత్యేకంగా పవన్ భేటీ అయ్యారు. గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సామాజిక వర్గాలు పార్టీల బలబలాలు జనాల్లో వైసీపీ ప్రభుత్వం పై ఉన్న అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఆ రెండు నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ ఒకటికి రెండుసార్లు సర్వేలు చేయించి రిపోర్ట్లు తెప్పించుకున్నారు. కాబట్టి ఆ రిపోర్టులను దగ్గర పెట్టుకుని స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోటీ చేసే నియోజకవర్గాలను పవన్ అడుగుతున్నారు. దానికి చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది