Roja : పవన్ కళ్యాణ్‌ డ్రామా ఆర్టిస్ట్.. చంద్రబాబు ఈవీఎం సీఎం అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : పవన్ కళ్యాణ్‌ డ్రామా ఆర్టిస్ట్.. చంద్రబాబు ఈవీఎం సీఎం అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు

 Authored By ramu | The Telugu News | Updated on :9 July 2025,3:35 pm

ప్రధానాంశాలు:

  •  Roja : పవన్ డ్రామా ఆర్టిస్ట్.. చంద్రబాబు ఈవీఎం సీఎం అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు

Roja  : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వేడి కొనసాగుతోంది. మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్‌కే రోజా ఈసారి ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ “ఇది ప్రజల ఓటుతో ఏర్పడిన ప్రభుత్వం కాదు… ఇది ఈవీఎం ప్రభుత్వం” అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మేలో జరిగిన ఎన్నికల తరువాత, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేపట్టిన తీరు అసాధారణంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

Roja పవన్ కళ్యాణ్‌ డ్రామా ఆర్టిస్ట్ చంద్రబాబు ఈవీఎం సీఎం అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు

Roja : పవన్ కళ్యాణ్‌ డ్రామా ఆర్టిస్ట్.. చంద్రబాబు ఈవీఎం సీఎం అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు

Roja : ఇది ప్రజల ఓటుతో ఏర్పడిన ప్రభుత్వం కాదు… ఈవీఎం ప్రభుత్వం – రోజా

పవన్ కళ్యాణ్‌ ఒక డ్రామా ఆర్టిస్ట్ అయితే, చంద్రబాబు మాత్రం ఈవీఎం సీఎం అని ఎద్దేవా చేశారు. సాధారణంగా భారతదేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగిన తరువాత ఈవీఎంలను కనీసం 6 నెలల పాటు భద్రంగా ఉంచుతారు, కేసులు, రివ్యూ పిటిషన్ల కోణంలో ఇవి అవసరం కావచ్చు కాబట్టి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఎన్నికల తరువాత కేవలం 10 రోజుల్లోనే ఈవీఎంలను డిస్ట్రాయ్ చేయాలని G.O. జారీ చేయడం దారుణమని విమర్శించారు.

ఇది అడ్డంగా చూసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని నమ్మని చర్య అని , ఈవీఎంలపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి, అప్పటివరకు వాటిని తాకకూడదు అని ఆమె డిమాండ్ చేశారు. తాము దీని పై పోరాటం చేయడానికి వెనుకాడమని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది