TDP VS Janasena : ఇంత నీచానికి దిగజారుతారా… ఇలాంటి పార్టీ నాకు అవసరం లేదు.. టీడీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ఫైర్?
ప్రధానాంశాలు:
టీడీపీ, జనసేన మధ్య సీఎం పదవి పోటీ
ముందు జగన్ ను ఓడిద్దాం.. ఆ తర్వాత మనం సీఎం గురించి ఆలోచిద్దాం
టీడీపీ వర్సెస్ జనసేన యుద్ధంపై పవన్ ఫైర్
TDP VS Janasena : ప్రస్తుతం ఏపీలో ఒకే ఒక్క టాపిక్ చర్చనీయాంశంగా మారింది. అదే టీడీపీ, జనసేన నేతల మధ్య గొడవ. నిజానికి టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చాయి. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించారు. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని అక్కడే ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన పొత్తు రాజమండ్రి జైలు వద్దనే కన్ఫమ్ అయింది. అయితే.. టీడీపీ, జనసేన నేతల మధ్య తాజాగా గొడవ జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎవరు.. అనే విషయంపై టీడీపీ, జనసేన నేతల మధ్య గొడవ జరిగింది. జనసేన, టీడీపీ నేతలు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. పగటి కలలు కనొద్దు ముందే. ఏం అవకుండానే ముఖ్యమంత్రి ఎవరు.. మీకా.. మాకా అనేది ఇప్పుడే వద్దు. ముందు జగన్ ను ఓడించాలి. ఆ తర్వాత రాజు ఎవరు.. మంత్రి ఎవరు అనేది అప్పుడు ఆలోచిద్దాం అన్నారు.
ఇవన్నీ కూర్చొబెట్టి ఆరోజున మనం ఆలోచిద్దాం. ఈలోపల మనం చాలా ప్రాక్టికల్ గా కూర్చొని ఏం చేయాలి.. అనేది ఆలోచిద్దాం. దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఈలోపలే మనం పదవులేంటి.. అని ఆలోచించడం కరెక్ట్ కాదు. దీన్ని ఎవ్వరూ డీవియేట్ చేయకండి. మనోహర్ గారి అధ్యక్షతన ఈ అలయెన్స్ ను సమన్వయ పరిచే కమిటీకి అధ్యక్షుడిగా నియమిస్తున్నాం. అలాగే.. కేంద్రంలో బీజేపీ నాయకులతో, రాష్ట్రంలో ఉన్న టీడీపీ నాయకులతో ఈ సమన్వయ పరిచే కమిటీని చర్చలకు పంపిస్తాం. సమన్వయ కమిటీ పొత్తులపై నిర్ణయం తీసుకుంటుంది అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
TDP VS Janasena : ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయ ఉంది.. ఇప్పటి నుంచే ఏపీలో హడావుడి
ఏపీలో ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుపై కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అప్పుడే టీడీపీ, జనసేన నేతలు మాత్రం మాకే ముఖ్యమంత్రి పదవి అంటే మాకే అంటూ కొట్టుకుంటున్నారు.