
Nagababu : నాగబాబు శాఖలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న పవన్ కళ్యాణ్..!
Nagababu : ప్రముఖ సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు Nagababu మంత్రి అయినట్లేనని అంతా అంటున్నారు. రానున్న మార్చి నెలలో ఆయన ఎమ్మెల్సీ కావడం తదనంతరం మంత్రిగా ప్రమాణం చేయడం ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో Nagababu నాగబాబుకు ఏ శాఖలు కేటాయిస్తారు అనే దానిపై సర్వత్రా జోరుగా చర్చించుకుంటున్నారు.ప్రముఖ సినీ నటుడు నాగబాబు 2009లో తన అన్నయ్య చిరంజీవి Chiranjeevi స్థాపించిన ప్రజారాజ్యం prajarayam పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తరువాత తమ్ముడు పవన్ స్థాపించిన జనసేనలో Janasena క్రియాశీల సభ్యుడయ్యారు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Nagababu : నాగబాబు శాఖలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న పవన్ కళ్యాణ్..!
పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి Anakapalli నుంచి పోటీ చేయాల్సి ఉండగా, సీట్ల పంపకంలో భాగంగా ఆ స్థానం బిజెపికి BJP వెళ్లడంతో ఆయనను రాజ్యసభకు పంపుతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, బిజెపి ఆర్ కృష్ణయ్యను నామినేట్ చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడు నాగబాబును మంత్రివర్గంలో చేర్చుకోవాలని నిర్ణ యించారు.నాగబాబుకు టూరిజం సినిమాటోగ్రఫీ శాఖలు ఇస్తారని ప్రచారం కొనసాగుతుంది. అయితే ఈ శాఖలను తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ సుముఖంగా లేరంటున్నారు. తమ కుటుంబం మొత్తం సినీ రంగంలో ఉంది కాబట్టి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నట్లుగా సమాచారం.
జనాలతో కనెక్ట్ అయ్యే విధంగా శాఖలను తీసుకుంటే పార్టీ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారుట. అందుకే యువజన సర్వీసులు అలాగే మత్స్య శాఖలను నాగబాబు కోసం పవన్ సీఎం చంద్రబాబుని కోరనున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే యువజన సర్వీసుల శాఖ ప్రస్తుతం కడప జిల్లాకు చెందిన మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి వద్ద ఉంది. యువజన శాఖతో యువతకు, అలాగే మత్స్య శాఖతో ఏపీలో ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ఉన్న మత్స్యకారులకు చేరువ కావచ్చని పార్టీ భావిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ Pawan Kalyan తన అన్న తీసుకునే శాఖల విషయంలో జాగ్రత్తలు వహిస్తూ, ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లుగా సమాచారం.
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్‌లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
This website uses cookies.