Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గేమ్ స్టార్ట్ చేశాడా.. అలర్ట్ అవుతున్న టీడీపీ..!
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. ఆయన ఇటీవల బీజేపీకి దగ్గర అవుతూ వస్తున్నాడు. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ నొక్కి చెబుతున్నారు. ఇప్పటికే సనాతన ధర్మం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ హోరాహోరీగా తలపడగా.. పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం, […]
ప్రధానాంశాలు:
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గేమ్ స్టార్ట్ చేశాడా.. అలర్ట్ అవుతున్న టీడీపీ..!
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. ఆయన ఇటీవల బీజేపీకి దగ్గర అవుతూ వస్తున్నాడు. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ నొక్కి చెబుతున్నారు. ఇప్పటికే సనాతన ధర్మం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ హోరాహోరీగా తలపడగా.. పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం, బీజేపీతో పొత్తు లాంటి అంశాలు కలిసొచ్చి తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.
Pawan Kalyan పవన్ గేమ్ ప్లాన్..
అయితే 2019 ఎన్నికల్లో టీడీపీకి దూరమైన జనసేన.. బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ సైతం అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు. దీంతో మళ్లీ కలిసి పని చేయడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జమిలి ఎన్నికల దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇటు ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. దీంతో, పాలనా వ్యవహారాలతో పాటుగా సంక్షేమ పథకాల అమలు పై చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మూడు పార్టీల పొత్తు కొనసాగాలని.. మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండాలని చంద్రబాబు పదే పదే సూచిస్తున్నారు.
కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ ప్రధాన పార్టీగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోంది. చంద్రబాబు కు పవన్ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నాయకత్వంతోనూ సత్సంబంధాలు నడుపుతున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. టీడీపీ నేతలు రాజకీయంగా చేసే విమర్శల్లో పవన్ జోక్యం చేసుకోవటం లేదు. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. కానీ, క్రెడిట్ దక్కే అంశాల్లో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కోరుకుంటున్నట్లుగా కూటమిగా కొనసాగటానికి పవన్ కు అభ్యంతరం లేకపోయినా .. మరో విడత కూడా డిప్యూటీ సీఎంగానే ఉండాలంటే అందుకు పవన్ అంగీకరిస్తారా అనేది అసలు అంశంగా మారుతోంది.