Pawan Kalyan : చిన్న ప్రమాదమే అనుకున్న కానీ ఇంత పెద్ద ప్రమాదమా.. అంటూపవన్ కల్యాణ్..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : చిన్న ప్రమాదమే అనుకున్న కానీ ఇంత పెద్ద ప్రమాదమా.. అంటూపవన్ కల్యాణ్..!
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓ చిన్న అగ్ని ప్రమాదంగా భావించిన ఘటన తీవ్రమైన పరిణామాలకూ దారితీస్తుందని ఊహించలేదని ఆయన అన్నారు. సింగపూర్‌లోని పాఠశాలలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో కుమారుడి చేతులు, కాళ్లు కాలిపోయాయని, పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

Pawan Kalyan : చిన్న ప్రమాదమే అనుకున్న కానీ ఇంత పెద్ద ప్రమాదమా.. అంటూపవన్ కల్యాణ్..!
Pawan Kalyan కుమారుడి ఆరోగ్యం పై పవన్ ఆందోళన.. మీడియా ముందే కన్నీరు
ప్రమాద తీవ్రతపై వివరణ ఇస్తూ పవన్ కల్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం మార్క్ శంకర్‌కు బ్రంకోస్కోపీ వంటి పరీక్షలు జరుగుతున్నాయని, దీర్ఘకాలంలో శరీరంపై దాని ప్రభావం ఉంటుందా అన్నది డాక్టర్ల పరిశీలనలో ఉందన్నారు. పెద్ద కొడుకు పుట్టినరోజునే ఇలా చిన్న కుమారుడికి ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని పవన్ చెప్పారు. మీడియా ఎదుట మాట్లాడుతుండగా ఆయన కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్నవారిని భావోద్వేగానికి గురి చేసింది.
ప్రస్తుతం 8 ఏళ్ల మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఆయనకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ తన కుమారుడి ఆరోగ్యంపై మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.