Pawan VS Jagan VS Chandrababu : పవన్ కు ఉన్న ఆ టాలెంట్ ఈ ఇద్దరికీ లేదు.. ఆ విషయంలో జగన్, చంద్రబాబు వేస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan VS Jagan VS Chandrababu : పవన్ కు ఉన్న ఆ టాలెంట్ ఈ ఇద్దరికీ లేదు.. ఆ విషయంలో జగన్, చంద్రబాబు వేస్ట్

 Authored By kranthi | The Telugu News | Updated on :9 December 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  ఈ విషయంలో జగన్, చంద్రబాబు ఎందుకు వెనుకబడినట్టు?

  •  నడిరోడ్డు మీద జగన్ ను నిలదీస్తున్న పవన్ కళ్యాణ్

  •  పవన్ కు సపోర్ట్ ఇస్తున్న ప్రజలు

Pawan VS Jagan VS Chandrababu : ఏపీలో ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం కూడా లేదు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ రెండు ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. ఈసారి జగన్ ఒకవైపు.. మిగితా పార్టీలన్నీ మరోవైపు అన్నట్టుగా ఉంది పరిస్థితి. దానికి కారణం తెలుసు కదా. ఏపీ జగన్ పార్టీ వైసీపీ చాలా బలంగా ఉంది కానీ.. ఇప్పుడు ప్రజలు జగన్ మాటను నమ్మే పరిస్థితుల్లో లేరు అనే చెప్పుకోవాలి. జనాలు ఇప్పుడు జగన్ మాట అస్సలు వినడం లేదు. అసలు ఏపీలో ప్రజలు ఎవరి మాట వింటున్నారు అంటే.. అది ఒక్క పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి. పవన్ మాటలు మాత్రమే జనాలు వింటున్నారు. ఆయన చెప్పే మాటలకు జనాలు ప్రభావితం అవుతున్నారు. ఈ విషయంలో జగన్ మాత్రమే కాదు.. చంద్రబాబు కూడా ఫెయిల్ అనే చెప్పుకోవాలి. అంటే.. ఇక్కడ జనాలను మార్చగలిగే సత్తా ఉంది ఒక్క పవన్ కే. అందుకే చంద్రబాబు కూడా పవన్ ను పట్టకునే తిరుగుతున్నారు. జనసేన, టీడీపీ ఒక్కటయింది కూడా అందుకే.

రాజకీయంగా ఎవరికి ఎంత సత్తా ఉంది అనేది పక్కన పెడితే కనీసం రోడ్డు మీద మాట్లాడితే వినే పరిస్థితుల్లో కూడా జనాలు లేరు. కానీ.. పవన్ ఈ విషయంలో బెటర్ అనే చెప్పుకోవాలి. వాళ్లకు ఉన్న క్రేజ్ ప్రకారం చూసుకుంటే.. వాళ్ల ఆలోచనలు తీసుకుంటే పవన్ చాలా బెటర్. అందుకే వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో పాటు బీజేపీ కూడా కలవాల్సిందే. అప్పుడే జగన్ ను ఓడించే బలం ఈ మూడు పార్టీలు కలిస్తేనే వస్తుంది. జగన్ ను ఓడించడానికి ఆయన ఎంత కసిగా ఉన్నారో చాలాసార్లు చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరగడంలో పవన్ ముందుంటున్నారు.

Pawan VS Jagan VS Chandrababu : ఉత్తరాంధ్రలో ఉన్న అవినీతిపై జనసేన మాత్రమే మాట్లాడుతోంది

నిజానికి ఉత్తరాంధ్రలో ఉన్న అవినీతిపై జనసేన మాత్రమే మాట్లాడుతోందని.. ఇంకో మూడు నెలల్లో వైసీపీ దుష్టపాలన పోతుందని పవన్ చెప్పుకొస్తున్నారు. ఈ విషయం చంద్రబాబు ఫెయిల్ అనే చెప్పుకోవాలి. జగన్ ను తిట్టడంలో ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంలో పవన్ ముందుంటారు. టీడీపీ పొత్తు విషయంలో ఎందుకు పవన్ క్లారిటీగా ఉన్నారో కూడా చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రం నాశనం కాకూడదనే.. జగన్ మీద ఉన్న వ్యతిరేకతతోనే టీడీపీతో పొత్తు కడుతున్నామని పవన్ స్పష్టం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది