Pawan kalyan : పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ .. రెండు సర్వేలు తేల్చిందేంటంటే.. ?

Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేస్తారు అనేదానిపై ఇంతవరకు అధికారిక సమాచారం అయితే రాలేదు. వారం క్రితం టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాను విడుదల చేశాయి. అందులో 94 మందితో టీడీపీ జాబితా విడుదల చేస్తే ఐదుగురు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. టీడీపీ మొదటి జాబితాలో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారు. మరి జనసేన ఫస్ట్ జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం ఆశ్చర్యమే అని అంటున్నారు. బీజేపీ జాతీస్థాయిలో తొలి జాబితా విడుదల చేస్తే అందులో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా లాంటి వారు ఉంటారు. పార్టీ పెద్దలు తొలి జాబితాలో ఉండడం ఆనవాయితీ. కానీ జనసేన తొలి జాబితాలో డిప్యూటీ లీడర్ నాదెండ్ల మనోహర్ తో మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అది నిజమే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్లి టీడీపీ నేతలతో సమావేశం జరిపారు. వారి మద్దతుని కూడా అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొత్తగా పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలోకి దిగబోతున్నారని న్యూస్ వైరల్ అవుతుంది. ఇది జనసేన వర్గాలకు అంతర్గతంగా తెలిసిన వార్త అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయి అన్నదానిపై రెండు సర్వేలు ఫిబ్రవరి నెలలో చేయించుకున్నారని అంటున్నారు.

ఆ సర్వేలో మొత్తం రెండున్నర లక్షల మంది దాకా ఉండే పిఠాపురం జనాభాలో 60 వేల మంది దాకా కాపులు ఉన్నారట. వారంతా పవన్ కళ్యాణ్ కి ఓటేస్తే మిగిలిన సామాజిక వర్గాలు వారు కూడా కలిసి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారని, అంతే కాకుండా భారీ మెజారిటీ కూడా సాధిస్తారని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. పిఠాపురంలో మొత్తం రెండున్నర లక్షల మందిలో 60 వేల మంది కాపులు ఉంటే మిగిలిన లక్షా 90 వేల మంది బీసీలు, ఎస్సీ, బడుగు ఇతర సామాజిక వర్గాల వారు ఉన్నారు. మరి వారంతా కూడా ఓటు వేయాలి కదా అని చర్చ మొదలైందట. గోదావరి జిల్లాలో బీసీలు ఎస్సీ ఇతర సామాజిక వర్గాలకు విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీలకు కాపులకు పడదు అని ప్రచారం ఉంది. కులాల వారి చీలిపోయిన నేపథ్యం అంతట ఉంది. ఈ క్రమంలో కాపులు అంతా కట్టకట్టుకుంటే అది మేలే కానీ మిగిలిన వారు ఐక్యత చూసి రివర్స్ అవుతారు. ఆ ఓటు అప్పుడు ప్రత్యర్థికి ఈజీగా టర్న్ అవుతుంది. ఈ సామాజిక సమీకరణాలలో ఇబ్బందులు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ గెలిచి మూడు దశాబ్దాలు గడిచింది. ఆ పార్టీ 1983 నుంచి మూడుసార్లు మాత్రమే గెలిచింది. ఇక కాపులే ఎక్కువసార్లు ఇక్కడ గెలిచారు.

అంతేకాకుండా లోకల్స్ కి ఇక్కడి ప్రజలు పెద్దపీట వేశారు. తమ అభ్యర్థి తమ ప్రాంతంలో ఉండాలని, తమకు కనిపించాలని, మంచికి చెడ్డకు తమకు అందుబాటులో ఉండాలని ఆ నియోజకవర్గం వారికి ఉంది అని అంటున్నారు. మరోవైపు గతంలో కాంగ్రెస్ కి ఇక్కడ బాగా బలం ఉంది. అనేక సార్లు గెలిచింది. అదంతా ఇప్పుడు వైసీపీకి టర్న్ అయింది. అలాగే ప్రజారాజ్యం పార్టీ తరపున 2009లో వంగా గీత గెలిచారు. ఇప్పుడు ఆమె వైసీపీలో ఉన్నారు. అయితే ఆమెకు అప్పట్లో 1000 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. ఆనాడు కాంగ్రెస్, టీడీపీ తో సమానంగా ఆమెకు ఓట్లు వచ్చాయి. 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే 28 వేల ఓట్లు వచ్చాయి. ఆమె స్థానికంగా ఉంటూ కష్టపడ్డారు. దాంతో ఆమెకు ఓటు షేర్ వచ్చింది అని అంటున్నారు. ఇక ఇప్పుడు చూస్తే టీడీపీ లో మాజీ ఎమ్మెల్యే వర్మ బలంగా ఉన్నారు. ఆయన 2014లో ఇండిపెండెంట్గా గెలిచి సత్తా చాటారు. ఆయన తనకు టికెట్ దక్కకపోతే 2014 రిపీట్ అవుతుందని అంటున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయనకి సొంత ఇమేజ్ ఉంది. ఈ క్రమంలో పిఠాపురంలో జనసేన పోటీ అంటే అన్ని వర్గాల వారిని కలుపుకుపోవాలి అదే సమయంలో టీడీపీ, జనసేన ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కలిసి పని చేస్తే పవన్ కళ్యాణ్ కి విజయం ఖాయమని అంటున్నారు.

Recent Posts

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

13 minutes ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

46 minutes ago

Tribanadhari Barbarik : త్రిబాణధారి బార్బరిక్ ఊపునిచ్చే ఊర మాస్ సాంగ్‌లో అదరగొట్టేసిన ఉదయభాను

Tribanadhari Barbarik  : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్,…

1 hour ago

MLC Kavitha : జగదీష్‌ రెడ్డి లిల్లీపుట్… కేసీఆర్ లేకపోతే ఆయనను చూసే వాడు కూడా ఉండడు కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…

1 hour ago

It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం … డిప్రెషన్ నుంచి బయటపడేదెలా…?

It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…

5 hours ago

White Onion : మీ కొలెస్ట్రాలను సర్ఫ్ వేసి కడిగినట్లుగా శుభ్రం చేసే అద్భుతమైన ఆహారం… ఏంటది..?

White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…

6 hours ago

Super Seeds : ఈ గింజలు చూడడానికి చిన్నగా ఉన్నా… ఇది పేగులను శుభ్రంచేసే బ్రహ్మాస్త్రం…?

Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…

7 hours ago

German Firm Offer : అద్భుతం గురూ… 2 కోట్లు ఇస్తే చనిపోయిన తర్వాత మళ్లీ బ్ర‌తికిస్తాం.. బంపర్ ఆఫర్ ఇచ్చిన కంపెనీ…?

German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…

8 hours ago