Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో మరో సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన రష్మిక మందన్న..!
Rashmika Mandanna : టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడికి ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ గీతగోవిందం ‘ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వీరిద్దరి జోడి కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా ఇద్దరు కలిసి నటించారు.ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రావాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా రష్మిక మందన్న టోక్యోలో జరగనున్న క్రంచి అనిమే అవార్డు వేడుకకు హాజరయ్యేందుకు జపాన్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
విజయ్, నేను కలిసి నటించే సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు అని తెలుసు. మేమిద్దరం స్క్రిప్ట్ కోసం చూస్తున్నాం. మంచి కథ కుదిరితే ఖచ్చితంగా కలిసి నటిస్తామని రష్మిక వెల్లడించారు. గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రష్మిక, విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ జంటకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ కారణంగా తరచూ సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తారు. ఇటీవల రష్మిక భర్త వీడిలా ఉండాలి. ఆమెను ప్రొటక్ట్ చేయాలి. క్వీన్ లాంటి ఆమెకు కింగ్ లాంటి భర్త రావాలి అని ఓ అభిమాని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రష్మిక అవును అది నిజమే అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అభిమానులు అర్థం చేసుకుంటున్నారు.
బయట కూడా రష్మిక విజయ్, కలిసి కనిపించడంతో వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ వీరిద్దరి జోడి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం రష్మిక మందన్న అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప ది రూల్ లో హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ ‘ ఫ్యామిలీ స్టార్ ‘ సినిమాలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. మొత్తానికి అయితే విజయ్ దేవరకొండ రష్మిక మందన కాంబినేషన్లో మరో సినిమా కచ్చితంగా ఉంటుందని తెలుస్తుంది దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
This website uses cookies.