Pawan Kalyan : వైసీపీ తగ్గడం టీడీపీ కన్నా జనసేనకే ఎక్కువ హుషారు తెప్పిస్తుందా ?
Pawan Kalyan : ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏపీలో రచ్చ చేస్తుంది. వైసీపీని దించే క్రమంలో పవన్ కళ్యాణ్ ముందు ఉండి పొత్తు కుదిర్చాడు. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అయితే చాన్స్ దొరికితే మళ్లీ వైసీపీ బలపడి అధికారంలోకి వస్తుంది అన్న బెంగ ముగ్గురు మిత్రులలోనూ ఉంటుంది. 2029లోనూ టీడీపీ కూటమి పోటీ చేస్తుంది అని ఎన్నికలకు ముందే పవన్ చెప్పేశారు. టీడీపీతో పొత్తు పదేళ్ల పాటు కొనసాగాలని కూడా […]
ప్రధానాంశాలు:
Pawan Kalyan : వైసీపీ తగ్గడం టీడీపీ కన్నా జనసేనకే ఎక్కువ హుషారు తెప్పిస్తుందా ?
Pawan Kalyan : ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏపీలో రచ్చ చేస్తుంది. వైసీపీని దించే క్రమంలో పవన్ కళ్యాణ్ ముందు ఉండి పొత్తు కుదిర్చాడు. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అయితే చాన్స్ దొరికితే మళ్లీ వైసీపీ బలపడి అధికారంలోకి వస్తుంది అన్న బెంగ ముగ్గురు మిత్రులలోనూ ఉంటుంది. 2029లోనూ టీడీపీ కూటమి పోటీ చేస్తుంది అని ఎన్నికలకు ముందే పవన్ చెప్పేశారు. టీడీపీతో పొత్తు పదేళ్ల పాటు కొనసాగాలని కూడా ఆయన ఆకాంక్షించారు. అయితే 2029లో వైసీపీ కాస్త జోరు అందుకొని టీడీపీకి గట్టి పోటీ ఇస్తుందని అందరు అనుకుంటున్నారు.
Pawan Kalyan జనసేన వెయిటింగ్..
కాని ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. బడా నాయకులు పార్టీ ఫౌండేషన్ నుంచి ఉన్న లీడర్లు అన్నీ తెంపుకుని వచ్చేస్తున్నారు అంటే ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు. ఏ పార్టీలో అయినా ఉండాలీ అంటే విధేయతతో పాటు ఎమోషనల్ బాండేజ్ కూడా ఉండాలి. వైసీపీలో చూస్తే ఇపుడు అవేమీ కనిపించడం లేదు. అందరు మెల్లగా టీడీపీ వైపు జారుకుంటున్నారు. ఇలా వైసీపీ తగ్గిపోవడం టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ ఖుషీని ఇస్తోంది అని అంటున్నారు. ఇక టీడీపీ పార్టీకి ఇపుడు అవసరాన్ని మించి బలం ఉంది. ఇంకా ఎక్కువ అయితే వర్గ పోరు తప్ప ఏమీ ఒరిగేది ఉండదు. పైగా వైసీపీకి ఇతర పార్టీల నుంచి తెచ్చుకుని తమ పార్టీని న్యూ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరమూ లేదు. ఆ పార్టీ ఎప్పటికపుడు పరిస్థితులకు అనుగుణంగా పెంచుకుంటూ పోతోంది. దాంతో వైసీపీ బలహీనం అయితే బలపడేది కచ్చితంగా జనసేన అని అంటున్నారు.
ఈ రోజుకు టీడీపీకి జనసేన మిత్రుడిగా ఉన్నా కూడా రానున్న రోజులలో పటిష్టంగా మారాలని అనుకుంటోంది. వైసీపీ నుంచి వచ్చే జనాలు ఈ రోజున పెద్ద ఎత్తున టీడీపీలో చేరినా తరువాత కాలంలో అక్కడ చాన్స్ దక్కకపోతే జనసేనలోకే వస్తారు అన్న లెక్కలూ ఉన్నాయి. జనసేనకు చూస్తే గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో పట్టు ఉంది. గుంటూరు, క్రిష్ణాలలో కొంత బలం ఉంది. పట్టు సంపాదించాల్సింది గట్టిగా రాయలసీమ జిల్లాలలోనే. టీడీపీ ఇప్పటికే అక్కడ పటిష్టంగా ఉంది కాబట్టి వైసీపీ వీక్ అయితే రానున్న రోజులలో జనసేన గట్టిగా మారనుంది. చూస్తే టీడీపీకి అపోజీషన్ పార్టీ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. వైసీపీ అంత బలమైన పార్టీగా ఉన్నా కూడా ఇప్పుడు క్రమంగా క్షీణించిపోతుంది. ఈ క్రమంలో జనసేన మళ్లీ పొలిటికల్ స్పేస్‌లో దూరి రచ్చ చేసేందుకు సిద్ధంగా ఉంది. మరి ఏం జరగనుందో చూడాలి.