Pawan Kalyan : ఛీ మీ బుద్ది ఇక మారదా..? వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ఫుల్ సీరియస్
ప్రధానాంశాలు:
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం
Pawan Kalyan : ఛీ మీ బుద్ది ఇక మారదా..? వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ఫుల్ సీరియస్
Pawan Kalyan : నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రసన్నకుమార్ రెడ్డిని ఉద్దేశించి తన విద్యాభ్యాసాన్ని గురించి ప్రశాంతి రెడ్డి ప్రశ్నించగా, దానికి కౌంటర్‌గా నల్లపురెడ్డి ఆమెపై వ్యక్తిగత స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కోవూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Pawan Kalyan : ఛీ మీ బుద్ది ఇక మారదా..? వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ఫుల్ సీరియస్
Pawan Kalyan : మహిళలను కించపరచడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది – పవన్
ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మహిళల గౌరవాన్ని భంగపరిచేలా వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకు అలవాటైపోయిందని విమర్శించారు. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, మహిళా ఎమ్మెల్యే అయిన ప్రశాంతిపై వ్యక్తిగత దూషణలు చేయడం సమాజంలో తీవ్రంగా తీసుకోవాల్సిన అంశమని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామికవాదులు ఒక్కటిగా నిలబడి అశ్లీల వ్యాఖ్యల్ని ఖండించాలన్నారు. అలాగే, చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
ఇక నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. మహిళ అని చూడకుండా నిందనీయమైన వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ అధినేత స్వయంగా తన సోదరి షర్మిలపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఇప్పుడు అదే బాటలో ఇతర నేతలు నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఇది వైసీపీ పార్టీలో మహిళల పట్ల ఉన్న అవగాహనను బయటపెట్టే ఉదాహరణ అని అన్నారు. ఇటువంటి నాయకుల మాటలు, ప్రవర్తనలను ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారని, తగిన సమయంలో సమాధానం ఇస్తారని నారాయణ పేర్కొన్నారు.