Pawan Kalyan : జగన్, షర్మిళ మధ్యలో పవన్ ఎంట్రీ.. ఏం జరుగుతుందా అని టెన్షన్..!
Pawan Kalyan : ఇప్పుడు ఏపీలో షర్మిళ, జగన్ ఇష్యూ చర్చనీయాంశంగా మారగా, వారి మధ్యలోకి పవన్ దూరడం హాట్ టాపిక్ అయింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలతో సరస్వతి పవర్ సంస్థలో అటవి శాఖ అధికారులు సర్వే చేయడం మొదలుపెట్టారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు శనివారం దాచేపల్లి, మాచవరం మండలంలోని సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములలో దాచేపల్లి డీఆర్వో ఆధ్వర్యంలో అటవి శాఖ అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు.మరోవైపు […]
ప్రధానాంశాలు:
Pawan Kalyan : జగన్, షర్మిళ మధ్యలో పవన్ ఎంట్రీ.. ఏం జరుగుతుందా అని టెన్షన్..!
Pawan Kalyan : ఇప్పుడు ఏపీలో షర్మిళ, జగన్ ఇష్యూ చర్చనీయాంశంగా మారగా, వారి మధ్యలోకి పవన్ దూరడం హాట్ టాపిక్ అయింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలతో సరస్వతి పవర్ సంస్థలో అటవి శాఖ అధికారులు సర్వే చేయడం మొదలుపెట్టారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు శనివారం దాచేపల్లి, మాచవరం మండలంలోని సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములలో దాచేపల్లి డీఆర్వో ఆధ్వర్యంలో అటవి శాఖ అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు.మరోవైపు పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాలలో ఉన్న సరస్వతి పవర్ సంస్థ భూముల్లో అటవీశాఖకు చెందిన భూములు ఏమైనా ఉన్నాయా అనే దానిపై సర్వే చేయాలని.. ఏవైనా భూములు కలిసి ఉంటే వాటి విస్తీర్ణం ఎంత అనే దానిపై నివేదిక ఇవ్వాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇటీవల అటవీ పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించారు
Pawan Kalyan పవన్ ఎంట్రీ..
జగన్ షర్మిల ఆస్తుల వివాదం కంటే కూడా సరస్వతి పవర్ సంస్థకు ఇచ్చిన భూముల మీద వాటికి వచ్చిన అనుమతుల మీద పూర్తి స్థాయిలో స్టడీ చేయమని అధికారులకు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.వైఎస్ జగన్- ఆయన చెల్లెలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదాలకు కేంద్ర బిందువైందీ సంస్థ. ఇందులో షర్మిలకు కేటాయించిన వాటాలను నిలిపివేయాలంటూ వైఎస్ జగన్, ఆయన భార్య భారతి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటీషన్ దాఖలు చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.తహసిల్దార్ క్షమారాణి, అటవీశాఖ అధికారి విజయలక్ష్మీ పర్యవేక్షణలో ఈ సర్వే కొనసాగింది. అందులో అటవీ భూములు, చెరువులు, కుంటలు లేవని తేల్చారు. మాచవరం మండలంలో 1077.38 పట్టా భూములను ఫ్యాక్టరీ యాజమాన్యం గతంలో కొనుగోలు చేసిందని క్షమారాణి వివరించారు.
మాచవరం మండలంలోని చెన్నైపాలెంలో 272.96, పిన్నెల్లిలో 93.79 ఎకరాలు, వేమవరంలో 710.63 ఎకరాలు భూమిని గతంలో సరస్వతి పవర్ యాజమాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. మొత్తం 1073.38 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేశారని, అవన్నీ పట్టా భూములేనని అన్నారు.మరోవైపు సరస్వతి పవర్ సంస్థకు ఉన్న 1500లకు పైగా ఎకరాల్లో వాగులు, వంకలతో పాటుగా, కొండ భూములు, ప్రకృతి సంపద ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల వ్యవహారంపై ఉన్నతాధికారులతో చర్చించారు. సరస్వతి పపర్ సంస్థ భూముల్లో ప్రభుత్వ భూములు, జలవనరులు ఎంత వరకూ ఉన్నాయనే దానిపై వివరాలు అందించాలని ఆదేశించారు.అడవీ భూములు ఉన్నప్పటికీ పర్యావరణ అనుమతులు ఎలా ఇచ్చారో చెప్పాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను సైతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు