
Pawan Kalyan : తనను పిఠాపురానికే పరిమితం చేయొద్దని కోరిన పవన్
Pawan Kalyan : సంక్రాంతి పండుగ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురంలో సందడి చేసారు. పిఠాపురం నియోజకవర్గాన్ని కేవలం ఒక రాజకీయ స్థానంగా కాకుండా, ఒక ఆదర్శవంతమైన మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు. కేవలం మొదటి ఏడాదిలోనే రూ. 308 కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించి, మార్చి నాటికి పనులు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. పరిపాలన అనేది వ్యక్తులపై కాకుండా, సింగపూర్ తరహాలో ఒక బలమైన ‘వ్యవస్థ’ మీద ఆధారపడి జరగాలని ఆయన ఆకాంక్షించారు. తాను వ్యక్తిగతంగా ప్రతి ఫంక్షన్‌కు హాజరు కావడం కంటే, తాను లేకపోయినా పనులు సజావుగా సాగేలా వ్యవస్థను నిర్మించడమే నిజమైన రాజకీయం అని ఆయన చెప్పుకొచ్చారు.
Pawan Kalyan : నన్ను పిఠాపురానికే పరిమితం చేయకండి : పవన్ కల్యాణ్
జనసేన పార్టీకి మంగళగిరి అడ్మినిస్ట్రేటివ్ కేంద్రమైతే, పిఠాపురాన్ని ‘ఐడియాలజికల్ హెడ్ క్వార్టర్స్’ (సిద్ధాంతపరమైన ప్రధాన కేంద్రం)గా ప్రకటించడం ద్వారా పవన్ కల్యాణ్ ఈ ప్రాంతానికి అత్యున్నత ప్రాధాన్యతను ఇచ్చారు. తనను కేవలం పిఠాపురానికే పరిమితం చేయవద్దని, ఇక్కడి నుండి గెలిచి జాతీయ స్థాయిలో పార్టీ గళం వినిపిస్తానని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, గత ప్రభుత్వ నాయకులు ప్రజల మధ్య కుల, మత వైషమ్యాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శిస్తూ, ప్రజలు అటువంటి వివాదాల్లోకి వెళ్ళకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇక సినిమాల్లో స్టార్ డమ్ ఉన్నప్పటికీ, సమాజంలో ఉన్న సమస్యలు తనను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించాయని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. తన ట్రస్ట్ ద్వారా పిఠాపురంలో మార్షల్ ఆర్ట్స్ మరియు ఫైన్ ఆర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేస్తానని ప్రకటించడం ద్వారా యువతకు నైపుణ్య శిక్షణపై తనకున్న ఆసక్తిని చాటుకున్నారు. ఇక కూటమి విషయానికి వస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు ఎలాంటి అభద్రతా భావం లేదని చెబుతూనే, నాయకులు పొత్తులను బలహీనపరిచేలా మాట్లాడవద్దని హెచ్చరించారు. వ్యవస్థకు ఎవరూ అతీతులు కారని, తాను ఎప్పుడూ రూల్ బుక్ ప్రకారమే పరిపాలన సాగిస్తానని ఆయన తేల్చి చెప్పారు.
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
MSG Collections | బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్ ఓపెనింగ్స్‌తో మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతున్నాడు…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్…
Actress : 70 మరియు 80వ దశకాల్లో తెలుగు చిత్రసీమలో తన గ్లామర్‌తో ఒక వెలుగు వెలిగిన నటి జయమాలిని.…
Sudigali Sudheer - Rashmi Gautam : బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన 'జబర్దస్త్' కామెడీ షో ఎంతోమంది సామాన్యులను…
Bhartha Mahasayulaku Wignyapthi : వరుస పరాజయాలతో సతమతం అవుతున్న మాస్ మహరాజ్ రవితేజ, తన తాజా చిత్రం “భర్త…
This website uses cookies.